Share News

Mosquito Coil Funny Video: ఎలా వస్తాయో ఇలాంటి విచిత్ర ఐడియాలు.. దోమలను తరిమి తరిమి కొడుతోందిగా..

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:35 PM

దోమల బెడద నివారించేందుకు ఓ మహిళ తన ఇంట్లో మస్కిటో కాయిల్స్ వెలిగించాలని అనుకుంది. సాధారణంగా అంతా వీటిని ఒక స్టాండ్‌కు తగిలిస్తుంటారు. అయితే అలా చేస్తే వింతేముంటుందీ.. అని అనుకుందో ఏమో గానీ.. ఈమె మాత్రం విచిత్రంగా ఆలోచించింది..

Mosquito Coil Funny Video: ఎలా వస్తాయో ఇలాంటి విచిత్ర ఐడియాలు.. దోమలను తరిమి తరిమి కొడుతోందిగా..

కొందరు రోటీన్‌కు భిన్నంగా చేసే పనులు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అదేవిధంగా ఎంతో ఉపయోగకరంగా కూడా అనిపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన ఇంట్లో దోమలను తరిమికొట్టేందుకు విచిత్ర ఏర్పాట్లు చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘దోమలను వెంటాడి చంపడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దోమల బెడద నివారించేందుకు ఓ మహిళ తన ఇంట్లో మస్కిటో కాయిల్స్ (Mosquito coils) వెలిగించాలని అనుకుంది. సాధారణంగా అంతా వీటిని ఒక స్టాండ్‌కు తగిలిస్తుంటారు. అయితే అలా చేస్తే వింతేముంటుందీ.. అని అనుకుందో ఏమో గానీ.. ఈమె మాత్రం విచిత్రంగా ఆలోచించింది.

Funny Viral Video: నీటిపై రంగు రంగుల చేప.. పట్టుకుని చూడగా షాకింగ్ సీన్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


మూల మూలకూ వెళ్లి దోమలను తరిమికొట్టేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం చివరకు పిల్లలు ఆడుకునే బొమ్మ ను తీసుకుంది. పీత ఆకారణంలో ఉన్న ఆ బొమ్మ కింద వదిలితే అటూ, ఇటూ వెళ్తుంటుంది. దీంతో ఆ బొమ్మకు (Moving Crab Toy) పైన రెండు వైపులా రెండు మస్కిటో కాయిల్స్‌ను తగిలించింది. తర్వాత బొమ్మను ఆన్ చేయగా.. ఇంట్లో మూల మూలకు తిరుగుతూ దోమలను తరిమికొడుతోంది.

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..


ఇలా మస్కిటో కాయిల్స్‌ను విచిత్ర పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈమె తెలివిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇక దోమలు తప్పించుకోవడం కష్టమే’’.. అంటూ కొందరు, ‘‘బొమ్మలను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 92 వేలకు పైగా లైక్‌లు, 1.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 01:35 PM