Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:11 AM
ఓ కోతి చేసిన నిర్వాకం చూసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కోతి పిల్లను కోతి ముద్దు చేయడం సర్వసాధారణం. అయితే ఈ కోతి మాత్రం అందుకు విరుద్ధంగా కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతోంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తల్లులు.. వారిని చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. కొందరైతే ఏకంగా వారి ప్రాణాలనే తీసేస్తూ తల్లి ప్రేమకు కలంకం తెస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి సమయాల్లో మనుషుల కంటే జంతువులే మేలని చెప్పొచ్చు. ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘కసాయి తల్లులకు కనువిప్పు కలిగించే వీడియో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి చేసిన నిర్వాకం చూసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కోతి పిల్లను కోతి ముద్దు చేయడం సర్వసాధారణం. అయితే ఈ కోతి మాత్రం అందుకు (Monkey carrying puppy) విరుద్ధంగా కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది.
Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
కుక్క పిల్లను గట్గిగా పట్టుకుని చెట్టు మీదకు ఎగిరింది. ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు ఎగురుతున్నా కూడా కుక్క పిల్లను కింద పడేయకుండా ఎంతో జాగ్రత్తగా పట్టుకుంది. ఇలా కుక్క పిల్లను చాలా సేపు లాలిస్తూ తన సొంత పిల్లను చూసుకున్నట్లుగా చూసుకుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 3.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు రద్దు .. రిజర్వేషన్ టికెట్ రిఫండ్ పొందండం ఎలాగంటే..

ఈ ఫొటోలో 78 ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా..?

ప్రాణాలు తీస్తున్న ప్రేమికులు.. కాళ్లపారాని ఆరకముందే ..

బైకు హ్యాండిల్‌కు వేలాడుతున్న బ్యాగు.. దగ్గరికి వెళ్లి చూడగా..
