Share News

Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:56 AM

గోడలకు చెవులు ఉంటాయన్నమాట ఒకప్పటి మాట.. గోడలకు చెవులే కాకు కళ్లు కూడా ఉంటాయన్నది ఇప్పుడు మాట. మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోతోంది. ఏకాంత ప్రదేశంలో కనిపిస్తే ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి. ఆఖరికి ..

Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

గోడలకు చెవులు ఉంటాయన్నమాట ఒకప్పటి మాట.. గోడలకు చెవులే కాకు కళ్లు కూడా ఉంటాయన్నది ఇప్పుడు మాట. మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోతోంది. ఏకాంత ప్రదేశంలో కనిపిస్తే ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి. ఆఖరికి బాత్‌రూంకు వెళ్లినా కూడా సేఫ్టీలేని రోజులివి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే’’..అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పట్టణాలు, నగరాల్లోని హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు (Secret cameras in hotel rooms) పెట్టి మహిళలను అసభ్యకరంగా వీడియోలు తీస్తున్న సందర్భాలను తరచూ చూస్తున్నాం. దీనిపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా మహిళలు అవగాహన లేక కెమెరాలకు దొరికిపోతున్నారు.

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..


నేరగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా బాత్‌రూంలో కెమెరాలు (Cameras in the bathroom) పెడుతున్నారు. తీరా కెమెరాలు బయటపడిన తర్వాత.. షాక్ అవడం మన వంతవుతుంటుంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇలాగే జరిగింది. బాత్‌రూంలోకి వెళ్లగానే అంతా బాగున్నట్లే కనిపించింది. అద్దంలో కూడా ఎలాంటి కెమెరా లేనట్లు అనిపిస్తుంది. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించగా.. నేలపై ఫ్లోరింగ్‌ టైల్స్ మధ్యలో ఎర్రటి లైట్ కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి పరిశీలించగా.. అక్కడ సీక్రెట్ కెమెరా ఉన్నట్లు బయటపడింది.

Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..


ఇలా ఎవరికీ అనుమానం రాకుండా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారనేందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అమ్మాయిలూ.. బాత్‌రూంలోకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండండి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లు, 7.70 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Theft Video: వామ్మో.. ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. చీరలను ఎలా చోరీ చేసిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 10:57 AM