Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న క్లాక్‌ను 15 సెకన్లలో గుర్తించండి..
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:31 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు స్నేహితులు కారులో ఫారెస్ట్ రైడ్‌కు వెళ్తుంటారు. ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. మరో వ్యక్తి అడవి జంతువులను వీడియో తీసుకుంటుంటాడు. ఇంకో వ్యక్తి మధ్యలో కూర్చుని ఆసక్తిగా గమనిస్తుంటాడు. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ క్లాక్ కూడా దాగి ఉంది. దాన్ని 15 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు నెటిజన్లకు పెద్ద పరీక్షగా మారుతున్నాయి. మరికొన్ని పజిల్స్‌కు ఎంత ప్రయత్నించినా సమాధానాలు కనుక్కోలేని పరిస్థితి వస్తుంటుంది. అయినా చాలా మంది సమాధానాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కలుగుతుంది. తాజాగా, మీకోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న క్లాక్‌ను 15 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు స్నేహితులు కారులో ఫారెస్ట్ రైడ్‌కు వెళ్తుంటారు. ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. మరో వ్యక్తి అడవి జంతువులను వీడియో తీసుకుంటుంటాడు. ఇంకో వ్యక్తి మధ్యలో కూర్చుని ఆసక్తిగా గమనిస్తుంటాడు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
ఆ కారుకు అటువైపు మూడు జిరాఫీలు నిలబడి ఉంటాయి. వాటి పక్కన పెద్ద పెద్ద చెట్లను కూడా చూడొచ్చు. అలాగే కారుకు ఇటువైపు మూడు ఏనుగులు చెట్ల మధ్యలో మేత మేస్తుంటాయి. ఈ చిత్రంలో జంతువులు, చెట్లు, కారు, మనుషులు తప్ప ఇంకే వస్తువూ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (Hidden clock) ఓ క్లాక్ కూడా దాక్కుని ఉంది.
Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
అయితే ఆ క్లాక్ అంత సులభంగా మీ కంటికి కనించదు. అలాగని దాన్ని గుర్తించడం అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ క్లాక్‌ను ఎంతో సులభంగా కనిపెట్టేయవచ్చు. చాలా మంది దాన్ని గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..
అయినా కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందకు ఆలస్యం.. ఆ క్లాక్ ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. మీకు 15 సెకన్ల సమయం ఇస్తున్నాం. ఈలోపు కనుక్కున్నాంటే మాత్రం.. మీ చూపు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు అర్థం.
మీ టైం స్టార్ట్ నౌ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సమాధానం కోసం ఈ కింద ఉన్న చిత్రం చూడండి..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..