Share News

Viral Video: బీపీ మిషన్‌‌కు వింత పరీక్ష.. చివరకు ఎలాంటి ఫలితం వచ్చిందో చూడండి..

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:53 PM

ఓ వ్యక్తి బీపీ మిషిన్‌ను పరీక్షించాలని అనుకున్నాడు. అయితే మనుషులకు బీపీ చెక్ చేయకుండా వినూత్నంగా పరీక్షించాడు. శీతల పానీయానికి సంబంధించిన బాటిల్‌కు బీపీ యంత్రాన్ని అమర్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: బీపీ మిషన్‌‌కు వింత పరీక్ష.. చివరకు ఎలాంటి ఫలితం వచ్చిందో చూడండి..

వింతలు, విశేషాలు, వినోదాలకు సంబంధించిన అనేక ఘటనలకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. కొన్ని వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బీపీ మిషన్‌కు వింత పరీక్ష పెట్టాడు. బీపీ మిషన్‌ను వాటర్ బాటల్‌కు బీపీ టెస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బీపీ మిషిన్‌ను (Blood pressure machine) పరీక్షించాలని అనుకున్నాడు. అయితే మనుషులకు బీపీ చెక్ చేయకుండా వినూత్నంగా పరీక్షించాడు. శీతల పానీయానికి సంబంధించిన బాటిల్‌కు బీపీ యంత్రాన్ని అమర్చాడు. తర్వాత మిషిన్‌ను ఆన్ చేయగా.. ఆశర్యకర ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


మనుషులకు చూపించినట్లుగానే వాటర్ బాటిల్‌కూ బీపీ చూపించింది. చివరకు మిషన్ స్క్రీన్‌పై 120, 76 నంబర్లు కనిపించాయి. ఇలా ప్లాస్టిక్ బాటిల్‌కు (BP test for plastic bottle) యంత్రాన్ని పెట్టి, బీపీ చెక్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..


‘‘బాటిల్ కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.. అందుకే ఇలా జరిగింది’’.., ‘‘ఇది ఎడిటింగ్ చేశారు.. నిజానికి అలా చూపించడం జరగదు’’.., ‘‘బాటిల్‌కూ పల్స్ రేటు ఉంటుదన్నమాట’’.., ‘‘థర్మామీటర్‌తో పరీక్షించినా కూడా ఏదో నంబర్ కనిపిస్తుంది’’.., ‘‘ఇతన్ని తీసుకెళ్లి ఫస్ట్ క్లాస్‌లో పడేయండి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 3.35 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Haircut Video: ఇలాక్కూడా కటింగ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 12:53 PM