Marriage Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో.. వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:13 AM
వివాహ సమయాల్లో వధూవరులను చూసినప్పుడు.. చూడచక్కని జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. మరికొన్నిసార్లు కొత్త జంటను చూసినప్పుడు.. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం.. అనే పాట పాడుతూ అంతా తమాషా చేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

వివాహ సమయాల్లో వధూవరులను చూసినప్పుడు.. చూడచక్కని జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. మరికొన్నిసార్లు కొత్త జంటను చూసినప్పుడు.. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం.. అనే పాట పాడుతూ అంతా తమాషా చేస్తుంటారు. వధూవరుల్లో ఒకరు అందంగా ఉంటే మరొకరు నల్లగా ఉండడమూ, అంద విహీనంగా ఉండడమే ఇందుకు కారణం. ఇలాంటి జంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెళ్లి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధువు డాన్స్ చేయడం చూసి అంతా సంబరపడ్డారు. అయితే అంతలోనే వరుడిని చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో బంధువుల సమక్షంలో వధువు డాన్స్ చేస్తోంది. అందమైన వధువు.. అంతే అందంగా డాన్స్ చేస్తుండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరికొందరు ఈలలు, చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
వధువు డాన్స్ చేస్తుండగా మధ్యలో వరుడు సడన్‌గా అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. వధువుతో పాటూ అతను కూడా (groom danced with the bride) డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. వరుడిని చూసి అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అందంగా ఉన్న వధువు పక్కన.. నల్లగా ఉన్న వరుడిని చూసి అంతా అవాక్కయ్యారు. ఆ వరుడు ఇదేమీ పట్టించుకోకుండా వధువుతో కలిసి డాన్స్ చేస్తూనే ఉన్నాడు.
ఇలా వధువు పక్కన ఏమాత్రం సెట్ కాకుండా ఉన్న ఈ వరుడు పెళ్లిలో అందరికీ షాక్ ఇచ్చాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు ఎవరో గానీ.. లక్కీ ఛాన్స్ కొట్టాడుగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 3.42 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అయ్యో... ఇలా జరిగిందేంటీ.. చెరుకు యంత్రంలో ఇరుక్కుపోయిన జడ.. చివరకు చూస్తే..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..