Share News

Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:14 PM

అడవిలో జంతువుల మధ్య భీకర ఫైట్ జరిగింది. ఓ ఘటనలో రెండు సింహాలు ఖడ్గమృగాన్ని టార్గెట్ చేస్తాయి. ఎలాగైనా దాడి చేయాలని చూస్తాయి. అయితే చివరకు ఖడ్గమృగం దెబ్బకు తోక ముడిచి, అక్కడి నుంచి పారిపోతాయి. మరో ఘటనలో..

Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..

ఖడ్జమృగం ఎంత పవర్‌ఫుల్ జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులులు, సింహాలు కూడా వాటి జోలికి వెళ్లేందుకు జంకుతుంటాయి. అయితే అన్ని జంతువులూ ఖడ్గమృగానికి భయపడతాయా.. అంటే ఆలోచించాల్సిందే. కొన్ని జంతువులను చూస్తే ఖడ్గమృగం కూడా భయంతో పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహం, ఏనుగు, నీటి ఏనుగుతో పోటీపడ్డ ఖడ్గమృగం.. ఏ జంతువుకు భయపడిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో జంతువుల మధ్య భీకర ఫైట్ జరిగింది. ఓ ఘటనలో రెండు సింహాలు ఖడ్గమృగాన్ని టార్గెట్ చేస్తాయి. ఎలాగైనా దాడి చేయాలని చూస్తాయి. అయితే చివరకు (rhinoceros chasing the lions) ఖడ్గమృగం దెబ్బకు తోక ముడిచి, అక్కడి నుంచి పారిపోతాయి. మరో ఘటనలో ఖడ్గమృగం ఏనుగుతో తలపడుతుంది.

Railway Tracks Accident Video: రైల్వే ట్రాక్స్‌పై గేమ్స్ ఆడితే ఇంతే.. ఇతడికేమైందో మీరే చూడండి..


అయితే ఇక్కడ మాత్రం దాని ఆటలు సాగలేదు. ఏనుగు తొండంతో నొక్కిపట్టి చుక్కలు చూపించింది. దెబ్బకు అక్కడి నుంచి పారిపోయింది. అలాగే నీటి ఏనుగుకు, ఖడ్గమృగానికి మధ్య ఫైట్ జరిగింది. ఇక్కడ కూడా నీటి ఏనుగు దాడిలో ఖడ్గమృగం ఓడిపోయింది. చివరకు గేదెతో పోటీ పడ్డ ఖడ్గమృగం తన ప్రతాపం చూపించింది. గేదెను వెంటపడి మరీ దాడి చేసింది. ఇలా అనేక జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. చివరకు ఏనుగులు, నీటి ఏనుగుల విషయంలో మాత్రం వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నమాట.

Lion Viral Video: గేదెను లాక్కెళ్తున్న సింహం.. వీడియో తీస్తున్న వ్యక్తి.. చివరకు సడన్‌గా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగం’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగుల ముందు ఎలాంటి జంతువైనా తోక ముడవాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లు , 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో.. వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 12:14 PM