Theft Viral Video: రోడ్డు పక్కన సమోసాలు తింటున్న వ్యక్తి.. వెనుకే నిలబడ్డ దొంగ.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:43 PM
స్వీట్స్ దుకాణం బయట ఓ వ్యక్తి రాత్రి వేళ సమోసాలు తింటున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైకులో అటుగా వచ్చారు. వారిలో ఓ వ్యక్తి సమోసాలు తింటున్న వ్యక్తి వెనుకే నిలబడ్డాడు. చివరకు ఎలా చోరీ చేశాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో చోరీకి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు దొంగలు ఎంతో తెలివిగా చోరీ చేయడం చూస్తుంటాం. పక్కనే నిలబడి ఏమాత్రం అనుమానం రాకుండా పర్సులు కొట్టేస్తుంటారు. మరికొన్నిసార్లు మహిళ మెడల్లోని గొలుసులను బలవంతంగా లాక్కెళ్లడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ చోరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి సమోసాలు తింటున్న సమయంలో దొంగ వెనుకే నిలబడ్డాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలో జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక సెక్టార్ 24 ప్రాంతంలోని స్టాండర్డ్ స్వీట్స్ దుకాణం బయట ఓ వ్యక్తి రాత్రి వేళ సమోసాలు తింటున్నాడు. ఇంతలో ఇద్దరు దొంగలు బైకులో వచ్చి అక్కడే ఆపారు.
Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..
కొద్దిసేపు అంతా గమనించిన దొంగ.. తర్వాత మెల్లిగా సమోసాలు తింటున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతను ఏమరపాటులో ఉన్న సమయంలో సడన్‌గా (thief snatched the chain) అతడి మెడలోని గొలుసును లాక్కుని పారిపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమైన బాధితుడు దొంగల బైకును వెంబడించాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Railway Tracks Accident Video: రైల్వే ట్రాక్స్‌పై గేమ్స్ ఆడితే ఇంతే.. ఇతడికేమైందో మీరే చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. దొంగలు చాలా తెలివిగా ఉన్నారే’’.. అంటూ కొందరు, ‘‘ఎవరు దొంగ.. ఎవరు మంచి వారు.. అనే విషయం తెలుసుకోలేకున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,300 కి పైగా లైక్‌లు, 2.42 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Lion Viral Video: గేదెను లాక్కెళ్తున్న సింహం.. వీడియో తీస్తున్న వ్యక్తి.. చివరకు సడన్‌గా..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..