Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:45 AM
ఓ వ్యక్తి సైకిల్‌పై వెనుక వైపు తన భార్యను ఎక్కించుకున్నాడు. అలాగే తన భుజాలపై చిన్న పిల్లాడిని కూడా ఎక్కించుకున్నాడు. ఇలా వారిద్దరినీ కూర్చోబెట్టుకుని సైకిల్‌ను వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

కొందరు వాహనాలు నడిపే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొందరు వేగంగా నడుపుతూ, ఇంకొందరు నిర్లక్ష్యంగా నడుపుతూ అందరికీ షాక్ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఎంతో బ్యాలెన్స్‌గా నడుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ అంకుల్ సైక్లింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇతడు సైకిల్ నడిపే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ పర్‌ఫెక్ట్ స్టాపింగ్ అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వెనుక వైపు తన భార్యను ఎక్కించుకున్నాడు. అలాగే తన భుజాలపై చిన్న పిల్లాడిని కూడా ఎక్కించుకున్నాడు. ఇలా వారిద్దరినీ కూర్చోబెట్టుకుని సైకిల్‌ను వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..
సైకిల్‌ను నడుపుతూ వెళ్తున్న అతను.. వారిని బస్ ఎక్కించాలని ప్రయత్నించాడు. ఎదురుగా బస్సు ఆగి ఉండడం చూసి నేరుగా దానికి ఎదురుగా వెళ్లాడు. వేగంగా బస్సు ఎదురుగా వెళ్లి.. చివరకు సరిగ్గా బస్సు డోరు వద్దనే సైకిల్‌ను ఆపేశాడు. తన కాలును బస్సు డోరు వద్ద పెట్టి సైకిల్‌ను ఆపి, వారిద్దరినీ బస్సు ఎక్కించాడన్నమాట. ఇతడు సైకిల్ తొక్కిన (Cycling) విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి టాలెంట్ బీహార్‌లో మాత్రమే కనిపిస్తుంది’’.. అంటూ కొందరు, ‘‘అంకుల్ డ్రైవింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లు, 9.54 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..