Viral Video: అయ్యో... ఇలా జరిగిందేంటీ.. చెరుకు యంత్రంలో ఇరుక్కుపోయిన జడ.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 07:41 AM
చెరుకు జ్యూస్ విక్రయిస్తున్న ఓ మహిళ.. మిషిన్ వద్ద పని చేస్తోంది. చెరుగును మిషిన్‌లో పెట్టి జ్యూస్ తీస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా ఆమె జుట్టు మిషిన్‌లో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి సమయంలో చాలా మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెరుకు మిషిన్‌లో మహిళ జడ ఇరుక్కుపోవడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెరుకు జ్యూస్ విక్రయిస్తున్న ఓ మహిళ.. మిషిన్ వద్ద పని చేస్తోంది. చెరుగును మిషిన్‌లో పెట్టి జ్యూస్ తీస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా ఆమె జుట్టు మిషిన్‌లో (Woman braid stuck in sugarcane machine) ఇరుక్కుపోవడంతో విలవిల్లాడిపోయింది. మిషిన్ నుంచి జడను ఎంత లాగినా రాలేదు.
పైగా మిషిన్ లోపలికి లాక్కోవడంతో చివరకు ఆమె తల కూడా ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఇంతలో చుట్టు పక్కల వారు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. చాలా సేపు శ్రమించి ఆమె జడను బయటికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో ఎవరూ గమనించకుంటే మాత్రం పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Viral Video: బీపీ మిషన్‌కు వింత పరీక్ష.. చివరకు ఎలాంటి ఫలితం వచ్చిందో చూడండి..
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.27 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..