Lion Viral Video: గేదెను లాక్కెళ్తున్న సింహం.. వీడియో తీస్తున్న వ్యక్తి.. చివరకు సడన్‌గా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 10:25 AM
ఓ సింహం రాత్రి వేళ జనావాసాల్లోకి చొరబడింది. నిర్మాణుష్య ప్రదేశంలోకి వెళ్లి సింహం.. చివరకు గేదెపై దాడి చేసింది. దీన్ని వీడియో తీస్తున్న కెమెరామెన్‌పై సింహం గర్జిస్తూ సీరియస్ అయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సింహాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. జనావాసాల్లోకి చొరబడే సింహాలు హల్‌చల్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం గేదెపై దాడి చేసి రోడ్డుపై లాక్కెళ్తోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లో (Gujarat) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ సింహం రాత్రి వేళ జనావాసాల్లోకి చొరబడింది. నిర్మాణుష్య ప్రదేశంలోకి వెళ్లి సింహం.. చివరకు గేదెను టార్గెట్ చేసింది. ఒక్కసారిగా గేదెపై (Lion attacking buffalo) దాడి చేసి మెడ పట్టేసుకుంది. తర్వాత దాన్ని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్లింది.
అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సింహాన్ని గమనించాడు. వెంటనే తన చేతిలోని ఫోన్ బయటికి తీసి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఇలా వీడియో తీస్తుండగా కాసేపటికి సింహం అతన్ని గమనించింది. ఆ వ్యక్తిని చూడగానే గేదెను కింద పడేసి, గర్జిస్తూ (Lion tries to attack cameraman) అతడికి మీదకు ఉరకబోయింది. అయితే అతను తెలివిగా తప్పించుకుంటూనే.. వీడియో తీస్తూ ఉన్నాడు. సింహం చాలా సేపు అతన్ని భయపెట్టాలని చూసింది గానీ.. సమీపానికి వచ్చే ధైర్యం చేయలేదు.
Viral Video: అయ్యో... ఇలా జరిగిందేంటీ.. చెరుకు యంత్రంలో ఇరుక్కుపోయిన జడ.. చివరకు చూస్తే..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కెమెరామెన్ ఎప్పటికీ చనిపోడని ఆ సింహానికి తెలిసినట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘సింహం గర్జన భయంకరంగా ఉంది బాబోయ్’’.., వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 22. 7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో.. వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..