Viral Video: వడ్డిస్తున్నారా.. మ్యాజిక్ చేస్తున్నారా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Jan 19 , 2025 | 05:28 PM
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరిలో దాగి ఉన్నా టాలెంట్ సందర్భానుసారం బయటికి వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. భోజనాలు వడ్డిస్తున్న యువకులను చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు చేసే పనుల్లోనే తమదైన స్టైల్‌ను చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు వినూత్నంగా భోజనాలు వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లు వడ్డిస్తున్నారా.. లేక మ్యాజిక్ చేస్తున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) భండారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా నిర్వహించే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వీరందరినీ స్థానికంగా భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే భక్తులకు భోజనాలు వడ్డిస్తున్న (Serving meals to devotees) వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
నేలపై వరుసగా కూర్చున్న భక్తులకు కొందరు యువకులు భోజనాలు వడ్డిస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. వారు వడ్డించే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి చేతిలో చిన్న చిన్న పేపర్ ప్లేట్లు పట్టుకుని వరుసగా ఇస్తూ పోతున్నాడు. ఓ చేతిలో ప్లేట్లను పట్టుకున్న అతను.. మరో చేత్తో వాటిని వేగంగా విసిరేస్తున్నాడు. దీంతో అవి సరిగ్గా భక్తుల ప్లేట్లలో పడిపోతున్నాయి. అలాగే అతడి వెనుక వస్తున్న యువకుడు కూడా గ్లాసులను అలాగే వేగంగా విసిరేస్తూ వెళ్తున్నాడు.
Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..
ఇలా వారంతా కలిసి భక్తలకు మెరుపు వేగంతో వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అలాగే వారి టాలెంట్‌ను పలువురు మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్లంతా భోజనాలు వడ్డించడంలో పీహెచ్‌డీ చేసినట్టున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 33 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..