Share News

Viral Video: దోచుకోవడానికి వచ్చిన దొంగకు వింత సర్‌ప్రైజ్.. చివరకు అంతా కలిసి ఇలా చేశారేంటీ..

ABN , Publish Date - Jan 19 , 2025 | 07:48 PM

ఓ యువకుడు ఇంట్లోకి చోరీకి వచ్చాడు. అయితే చోరీ చేసే సమయంలో ఏం జరిగిందో ఏమో గానీ.. సదరు ఇంటి యజమానికి దొరికిపోయాడు. దీంతో చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులంతా అక్కడ గుమికూడారు. తర్వాత అంతా కలిసి అతన్ని చితకబాది ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ చివరకు వారంతా చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: దోచుకోవడానికి వచ్చిన దొంగకు వింత సర్‌ప్రైజ్.. చివరకు అంతా కలిసి ఇలా చేశారేంటీ..
house owners celebrating thief birthday

దోచుకోవడానికి వచ్చే దొంగలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు దొంగలు చోరీకి వచ్చి ఎంచక్కా స్నానాలు చేసి, భోజనం చేస్తుంటే.. మరికొందరు ఏకంగా ఇంటి యజమానికి తిరిగి నగదు ఉంచి వెళ్తుంటారు. అలాగే ఇంకొందరు చోరీ చేయకుండా ఇంటి యజమానికి ముద్దు పెట్టి పారిపోవడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇందుకు పూర్తి విరుద్ధంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇళ్ల యజమానులంతా కలిసి దొంగకు వింత సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఇంట్లోకి చోరీకి వచ్చాడు. అయితే చోరీ చేసే సమయంలో ఏం జరిగిందో ఏమో గానీ.. (thief caught by the house owner) సదరు ఇంటి యజమానికి దొరికిపోయాడు. దీంతో చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులంతా అక్కడ గుమికూడారు. తర్వాత అంతా కలిసి అతన్ని చితకబాది ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్లు అలా చేయలేదు.

Viral Video: ఏమైందిరా..! ఓ వైపు ఊరేగింపు జరుగుతుండగా.. మరోవైపు వీళ్ల నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


ఆ రోజు సదరు దొంగ పుట్టిన రోజనే విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో వెంటనే అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆ మరుక్షణమే ఓ కేక్ తెప్పించారు. దానిపై దొంగ అని పేరు కూడా రాయించారు. అలాగే ఆ కేక్ పక్కన.. దొంగలకు చిహ్నంగా కొన్ని తాళం చెవులు, పెద్ద ఇనుప కట్టర్‌ను కూడా పెట్టారు. ఫైనల్‌గా ఆ దొంగతో కేక్ కట్ చేయించి, కేక్ ముక్కను అతడికి ప్రేమగా తినిపించారు కూడా. ఇలా అపార్ట్‌మెంట్ వాసులంతా (houses owners celebrated the thief's birthday) కలిసి దొంగ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు.

Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో.. పెళ్లిలో ఈ సీన్ చూస్తే కళ్లు తేలేస్తారు..


అనూహ్యంగా వారంతా కలిసి ఇలా చేయడం చూసి అవాక్కవడం దొంగ వంతైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హ్యాపీ.. బర్త్ డే.. మేరే చోర్ భై’’.. అంటూ కొందరు, ‘‘గౌరవం పొందిన మొదటి దొంగగా రికార్డుల్లోకి ఎక్కేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 8.62 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 19 , 2025 | 07:48 PM