Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో.. పెళ్లిలో ఈ సీన్ చూస్తే కళ్లు తేలేస్తారు..
ABN , Publish Date - Jan 19 , 2025 | 06:14 PM
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. పెళ్లికి హాజరైన వారంతా భోజనాల వద్దకు చేరుకున్నారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. బోజనాలు చేసే సమయంలో వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వధూవరుల విచిత్ర ప్రవర్తన, వినూత్న ఎంట్రీ, స్నేహితులు విచిత్ర ప్రాంక్‌లు.. ఇలా అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. వీటిలో కొన్ని వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో భోజనాల వద్ద చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘కక్కర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. పెళ్లికి హాజరైన వారంతా భోజనాల వద్దకు చేరుకున్నారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. భోజనాల వద్ద వారు చేసిన నిర్వాకం చూసి అంతా నగలబడి నవ్వుకుంటున్నారు.
Viral Video: వడ్డిస్తున్నారా.. మ్యాజిక్ చేస్తున్నారా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..
భోజనాల వద్ద వంటవారు దోసెలు వేస్తున్నారు. అయితే వాటికోసం చాలా మంది చేతిలో ప్లేట్లు పట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు దోసెలు వేస్తాడా.. ఎప్పుడెప్పుడు తిందామా.. అని ఆవురావురుమంటూ ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి దోసె వేసి, దానిపై ఉల్లిపాయలు వేయగానే అంతా ఒక్కసారిగా దోసెను లాక్కుంటారు. ఎవరి చేతికి వచ్చిన ముక్కను (guests forcibly grabbed Dosas) వారు లాక్కుని ప్లేటులో వేసుకుని తినేస్తారు.
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కక్కర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఏంట్రా.. ఇలా తయారయ్యారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 76 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..