Viral Video: చెట్టు ఎక్కి మరీ కోతి పిల్లను ఎత్తుకెళ్లిన చిరుత పులి.. చివరకు దాని నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:41 PM
మెరుపు వేగంతో వేటాడడంలో చిరుత పులులకు మించిన జంతువు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి వేటను టార్గెట్ చేస్తే ఇక దాని పంజా దెబ్బ నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చిరుత పులుల వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే ఇదే చిరుత కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ..
మెరుపు వేగంతో వేటాడడంలో చిరుత పులులకు మించిన జంతువు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి వేటను టార్గెట్ చేస్తే ఇక దాని పంజా దెబ్బ నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చిరుత పులుల వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే ఇదే చిరుత కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి చెట్టు ఎక్కి మరీ కోతి పిల్లను ఎత్తుకెళ్లింది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో రాత్రి వేళ వేట కోసం ఎదురు చూస్తున్న చిరుత పులికి చెట్టుపై ఓ కోతి పిల్ల కనిపిస్తుంది. దాన్ని చూడగానే చకచకా చెట్టు ఎక్కేస్తుంది. దీంతో ఆ కోతి పిల్ల చిరుతకు ఆహారమైపోతుందని అంతా అనుకుంటారు. కోతి పిల్ల కూడా చిరుతను చూసి తెగ భయపడిపోతుంది. చిరుత లాగేందుకు ఎంత ప్రయత్నించినా చెట్టును గట్టిగా పట్టుకుని ఉంటుంది. దీంతో చిరుత చివరకు కోతి పిల్ల తోక పట్టుకుని మరింత గట్టిగా లాగి కాస్త దూరంగా తీసుకెళ్తుంది.
కోతి పిల్లను దూరంగా తీసుకెళ్లిన చిరుత.. చెట్టు కొమ్మపై పడుకోబెట్టి, (leopard lovingly cared baby monkey) దాని పక్కనే పడుకుని లాలిస్తుంది. తల్లి తన పిల్లలను ఎలా లాలిస్తుందో.. అచ్చం అలాగే ఈ చిరుత కూడా కోతి పిల్లను చూసుకుంటుంది. చిరుత ప్రేమ చూపించడంతో కాసేపటికి కోతి పిల్లకూ భయం పోయి చిరుతతో కలిసిపోతుంది. ఇలా కోతిపిల్లను చిరుత తన పిల్లల తరహాలో చూసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా.. ఏకంగా చిరుతల ఆహారాన్నే లాగేయడంతో.. చివరకు..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల కంటే జంతువులకే మానవత్వం ఎక్కువగా ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘కోతి పిల్లపై ప్రేమ కరబరచిన చిరుత’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22లక్షలకు పైగా లైక్‌లు, 26.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీడియోల కోసం ఎంత పని చేశారు.. మేకలను కొండ అంచుపై నీళ్లలోకి తోలడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..