Viral Video: నడుస్తూ వెళ్తున్న వ్యక్తిపై దాడి చేయాలని చూసిన కుక్క.. చివరకు చిన్న టెక్నిక్‌తో ఎలా డైవర్ట్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:36 PM
కొత్త ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుక్కల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పాదచారులపై కుక్కలు దాడి చేయడం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు వాటి బారిన పడి చిన్న పిల్లలు, వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషాధ ఘటనలను కూడా చూశాం. ఇలాంటి..
కొత్త ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుక్కల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పాదచారులపై కుక్కలు దాడి చేయడం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు వాటి బారిన పడి చిన్న పిల్లలు, వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషాధ ఘటనలను కూడా చూశాం. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా ఓ కుక్క అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కుక్క సమీపానికి రాగానే అతడు చిన్న టెక్నిక్‌తో దాన్ని డైవర్ట్ చేసేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటాడు. మార్గ మధ్యలో అతడికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. రోడ్డు పక్కన రెండు కుక్కలు పడుకుని ఉంటాయి. అయితే ఆ యువకుడు ఓ కుక్క సమీపానికి వెళ్లడంతో సడన్‌గా పైకి లేచి, (dog tried to attack the youth) అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
కుక్క దాడితో సడన్‌గా షాకైన యువకుడు.. అక్కడే ఉన్న పెద్ద రాయి తీసుకుని, దాన్ని కొట్టకుండా కాస్త ముందు పడుకుని ఉన్న మరో కుక్క పైకి విసురుతాడు. దీంతో అతడిపై దాడి చేయడానికి వచ్చిన కుక్క.. డైవర్ట్ అయిపోయి ఎదురుగా ఉన్న కుక్కను వెంటపడుతుంది. దీంతో ఆ వ్యక్తి కుక్క వెనుకే పరిగెత్తుతూ వెళ్లి తెలివిగా తప్పించుకుంటాడు. ఇలా ఆ వ్యక్తి అతి తెలివితో కుక్క బారి నుంచి బయటపడతాడు.
Viral Video: వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా.. ఏకంగా చిరుతల ఆహారాన్నే లాగేయడంతో.. చివరకు..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి కుక్కను భలే డైవర్ట్ చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లు, 5లక్షలక పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీడియోల కోసం ఎంత పని చేశారు.. మేకలను కొండ అంచుపై నీళ్లలోకి తోలడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..