Share News

Locopilot Viral Video: ఈ రైలు డ్రైవర్‌కు దండం పెట్టాల్సిందే.. ఇంజిన్‌ను ఆపి మరీ ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Apr 02 , 2025 | 09:49 AM

రైల్వే గేటు వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు ఏర్పాటు చేయని ఓ ప్రాంతంలో వాహనాలు.. రైలు పట్టాలపై అటూ, ఇటూ దాటుకోవడం కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Locopilot Viral Video: ఈ రైలు డ్రైవర్‌కు దండం పెట్టాల్సిందే.. ఇంజిన్‌ను ఆపి మరీ ఏం చేస్తున్నాడో చూడండి..

రైలు ప్రయాణాల్లోనే కాకుండా రైల్వే గేట్ల వద్ద కూడా కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. వాహనదారులు తమకు ఇష్టమొచ్చినట్లు అడ్డదిడ్డంగా రైలు పట్టాలు దాటుతుంటారు. ఈ క్రమంలో కొందరు రైలు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకోవడం చూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. రైలింజన్‌ను ఆపి మరీ.. అతను చేసిన పని చూస్తే మీరు కూడా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు శభాష్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్వే గేటు (Railway gate) వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు ఏర్పాటు చేయని ఓ ప్రాంతంలో వాహనాలు.. రైలు పట్టాలపై అటూ, ఇటూ దాటుకోవడం కనిపిస్తుంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ వ్యక్తి అక్కడే నిలబడి దగ్గరుండి వాహనాలను రోడ్డు దాటిస్తుంటాడు.

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


కాసేపటి తర్వాత వాహనాలను స్టాప్ చేసిన లోకోపైలెట్ (Locopilot), రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్తాడు. దూరంగా ఆగి ఉన్న రైలింజన్ ఎక్కి, ఇంజిన్‌ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా రైలు డ్రైవర్ ఇంజిన్‌ను ఆపి, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన తర్వాత రైలును తీసుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Funny Video: దోసెలు వేస్తున్నాడా.. హోలీ ఆడుతున్నాడా.. ఈ మహిళ పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. రైల్వే గేట్‌మన్ లేనిచోట ఇలానే లోకోపైలెట్లే స్వయంగా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసుకుని మరీ వెళ్తుంటారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైలు డ్రైవర్ ఓపికకు దండం పెట్టాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 93 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugad Viral Video: బెడ్‌పైనే షికారు.. ఇతడి టాలెంట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 09:49 AM