Share News

Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:31 PM

ఆకలితో ఉన్న ఎలుగుబంటికి ఓ క్యాబేజీ దొరికింది. దీంతో దాన్ని తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఇందులో కొత్తదనం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఓ చెక్క టేబుల్‌పై క్యాబేజీతో పాటూ క్యారెట్ తదితర ఆహార పదార్థాలు ఉండడం చూసి ఎలుగుబంటి నేరుగా అక్కడికి వెళ్లిపోతుంది. చివరకు ఏం చేసిందో చూడండి..

Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..

అడవి జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. వేటాడాల్సిన పులులు, సింహాలు కాస్తా.. వాటితోనే స్నేహం చేస్తుంటాయి. అలాగే మనుషులతో కూడా స్నేహం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాంయి. ఇంకొన్ని మనుషులను అనుకరిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఎలుగుబంటికి ఓ క్యాబేజీ దొరికింది. దీంతో దాన్ని తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఇందులో కొత్తదనం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఓ చెక్క టేబుల్‌పై క్యాబేజీతో పాటూ క్యారెట్ తదితర ఆహార పదార్థాలు ఉండడం చూసి ఎలుగుబంటి నేరుగా అక్కడికి వెళ్లిపోతుంది.

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..


వాటిని తీసుకుని వెళ్లిపోకుండా.. క్యాబేజీ చేతిలోకి తీసుకుని మనుషుల తరహాలోనే తినడం స్టార్ట్ చేస్తుంది. బుద్ధిగా టేబుల్‌పై కూర్చుని,(bear sitting on dining table and eating cabbage) ప్లేటులో ఆహారాన్ని కొంచెం కొంచెం తిన్నట్లుగా.. ఈ ఎలుగు బంటి కూడా కొంచెం కొంచెం కొరుక్కు తింటూ ఉంటుంది. ఇలా ఒక్కటే పిల్లల తరహాలో బుద్ధిగా భోజనం చేస్తుండడం చూసి అక్కడే ఉన్న మహిళ ఎంతో మురిసిపోతుంది. వీడియో తీసుకుంటూ దగ్గరికి వెళ్లి ఎలుగుబంటిని పలకరిస్తుంది.

Auto Viral Video: లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా.. ఆటోను చూసి అవాక్కవుతున్న జనం..


తర్వాత ఎలుగుబంటికి క్యారెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. తినేందుకు ఇష్టపడదు. ‘‘క్యారెట్ వద్దు.. నాకు క్యాబేజీ అంటేనే ఇష్టం’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎలుగుబంటికి మర్యాద బాగా తెలిసినట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎలుగును ఇంటికి విందుకు ఆహ్వానించాలనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 83 వేలకు పైగా లైక్‌‌లు, 3.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Funny Viral Video: అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చపాతీలు చేస్తున్న యువతి నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 12:31 PM