Viral Video: దొంగలు కూడా షాకయ్యే ఐడియా.. ఈ పొలంలోకి అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిందే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:49 AM
ఓ రైతు తన పొలంలోకి దొంగలు, అడవి జంతువులు చొరబడకుండా ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు ఓ విచిత్రమైన ప్లాన్ వేశాడు. ఇతడి చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

అడవి జంతువులు, దొంగల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు రైతులు వివిధ రకాల ఏర్పాట్లు చేయడం చూస్తుంటాం. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత ఏర్పాట్లు చేస్తుంటారు. రాత్రి వేళ ఆటోమేటిక్‌గా శబ్ధాలు చేసేలా సెట్ చేయడం, వివిధ రకాల జంతువుల వేషధారణతో కనిపించడం, అలాగే వింతగా కనిపించే దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. తాజాగా, ఓ రైతు తన పొలంలో చేసిన వినూత్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వార్నీ.. నిరంతర నిఘా అంటే ఇదా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు తన పొలంలోకి దొంగలు, అడవి జంతువులు చొరబడకుండా ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు ఓ విచిత్రమైన ప్లాన్ వేశాడు. తన ఇంట్లోని పాత టేబుల్ ఫ్యాన్‌ను, ఓ లైటును పొలంలోకి తీసుకెళ్లాడు.
Theft Viral Video: ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఫ్యాన్ రెక్కతో పాటూ ముందు వైపు ఉండే రక్షణ కవచాన్ని ఊడదీశాడు. తర్వాత లైటును (Farmer installs light on table fan) ఫ్యాన్‌కు ముందు వైపు బిగించాడు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత.. ఫ్యాన్ ఆన్ చేయగా అటూ, ఇటూ తిరగడం స్టార్ట్ అయింది. దీంతో లైటు వెలుతురు కూడా పొలంలో అటూ, ఇటూ పడుతోంది. దూరం నుంచి చూసిన వారికి.. మనిషి లైట్ వేస్తున్నట్లే కనిపిస్తుంది. దీని వల్ల దొంగలు పొలంలోకి చొరబడేందుకు భయపడతారన్నమాట. ఇలా ఈ రైతు విచిత్రంగా ఆలోచించి, వినూత్న ఏర్పాట్లు చేశాడు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వార్నీ.. నిరంతర నిఘా అంటే ఇదా.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైతు ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.78 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..