Woman Funny Viral Video: అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చపాతీలు చేస్తున్న యువతి నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 09:18 AM
ఓ యువతి చపాతీలు చేస్తుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. సదరు యువతి చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఓ విచిత్ర సమస్య ఎదురైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. కొందరు నిత్యం ఫోన్ ధ్యాసలోనే ఉంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. మరికొందరు ఫోనే ప్రపంచంగా బతుకుతూ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతికి రోటీ చేస్తుండగా వింత సమస్య వచ్చింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు.. ‘‘అరెరే.. ఈ యువతికి పెద్ద సమస్యే వచ్చి పడిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి చపాతీలు చేస్తుండగా (young woman making chapatis) తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. సదరు యువతి చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. పిండి ఉండలను గుండ్రంగా రుద్ది, వాటిని పెనంపై వేడి చేస్తోంది. అంతా చేసే పని ఇదేగా.. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం.
Theft Viral Video: ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
చపాతీలు చేస్తున్న సమయంలో మధ్యలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. దీంతో ఫోన్ చేతిలోకి తీసుకుని (Young woman talking on phone) మాట్లాడుతుంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. గోధమ పిండిని గుండ్రంగా రుద్దిన తర్వాత కర్రతో సహా దాన్ని పైక్కకు తీసుకుని, ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. మధ్యలో బండపై తాను రుద్దిన చపాతీ కనిపించలేదని కంగారుపడుతుంది. ఆ చపాతీ తన చేతిలోనే ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. ఫోన్‌లో తీనమైన ఆమె.. చాలా సేపు అలా ఆ చపాతీ కోసం వెతుకుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో తన చేతిలోని కర్రను రెండు చేతుల్లోకి మార్చుకుంటూనే ఉంటుంది. కానీ చపాతీని మాత్రం గమనించదు.
అలా ఫోన్‌లో మాట్లాడుతూ తన కళ్ల ముందున్న చపాతీని గుర్తించలేని పరిస్థితిలో ఉందన్నమాట. అయితే ఈ వీడియో చూస్తుంటే.. ఇదంతా ఆమె వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా స్క్రిప్ట్.. ఈమె నటన మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 46 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: దొంగలు కూడా షాకయ్యే ఐడియా.. ఈ పొలంలోకి అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..