Share News

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:39 PM

మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. .

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

మాట్లాడే పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వివిధ రకాల చిలుకలు మాట్లాడడం చూస్తుంటాం. కొన్ని అచ్చం మనుషుల తరహాలో మాట్టాడడం, అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వడం చూస్తుంటాం. అయితే తాజాగా, మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలోని గర్గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకానే అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం వర్షాకాలంలో రోజుల వయసున్న కాకి కనిపించింది. దాన్ని తీసుకుని ఇంటికి వచ్చి పెంచుకున్నాడు.

Viral Funny Video: దోసెలు వేస్తున్నాడా.. హోలీ ఆడుతున్నాడా.. ఈ మహిళ పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అయితే ఆ కాకి పెరిగే కొద్దీ విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టింది. మనుషుల్లా (crows talking like humans) అరుస్తూ ఉండడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ‘‘అమ్మా, నాన్నా, మామ, దాదా’’.. ఇలా వివిధ అనేక పదాలను పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో చెక్క బల్లపై నిలబడ్డ కాకి.. తన ‘‘కాకా.. కాకా’’.. అంటూ ఎవరినో పిలుస్తోంది. ఇలా చాలా సేపు ఆ కాకి.. అలా పిలుస్తూ ఎదురు చూస్తుంటుంది. ‘‘నా బాస్ ఎక్కడికి వెళ్లాడో అర్థం కాలేదు.. కాకా.. కాకా..’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..


అంతా అడిగే ప్రశ్నలకు కాకి సమాధానాలు కూడా ఇస్తుందని చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆ కాక ఎక్కడున్నాడో త్వరగా తీసుకెళ్లండయ్యా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి కాకిని ఇప్పుడే చూస్తున్నాం.. భలే మాట్లాడుతోందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 59 వేలకు పైగా లైక్‌‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 01:39 PM