Share News

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:14 AM

ఓ మహిళ బట్టలు ఉతికేందుకు సిద్ధమైంది. అందరిలాగానే మాసిన బట్టలన్నీ కుప్పగా వేసింది. పక్కనే నీళ్ల బకెట్‌ను కూడా సిద్ధంగా పెట్టుకుంది. దుస్తులను బకెట్‌లో వేసి, సర్ప్ పొడి కలిపి నానబెడుతుందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

మహిళలు ఇంటి పనులు చేయడంలో కొన్నిసార్లు తమ బుర్రకు పని పెడుతుంటారు. వినూత్నంగా ఆలోచిస్తూ పెద్ద పెద్ద పనులను సైతం ఎంతో సులభంగా చేసేస్తుంటారు. కొందరు ఒకేసారి అనేక చపాతీలను రోల్ చేస్తే.. మరికొందరు సైకిల్ చక్రంతో బట్టు ఉతికేస్తారు. అలాగే ఇంకొందరేమో.. ఏకంగా ఇటుకలతో వాషింగ్ మెషిన్‌నే నిర్మిస్తారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ బట్టలు ఉతికే విధానం చూసి అంతా అవాక్కవుతారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది మట్టి కాదమ్మా.. బట్టలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బట్టలు ఉతికేందుకు సిద్ధమైంది. అందరిలాగానే మాసిన బట్టలన్నీ కుప్పగా వేసింది. పక్కనే నీళ్ల బకెట్‌ను కూడా సిద్ధంగా పెట్టుకుంది. దుస్తులను బకెట్‌లో వేసి, సర్ప్ పొడి కలిపి నానబెడుతుందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.

Auto Viral Video: లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా.. ఆటోను చూసి అవాక్కవుతున్న జనం..


దుస్తుల కుప్పపై సర్ప్ పొడిని కుమ్మరించింది. ఆ తర్వాత బకెట్‌ను పైకి ఎత్తుకుని బట్టలపై నీళ్లు పోసేస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇనుప పార తీసుకుని.. (young woman mixing clothes with an iron shovel) మట్టిని కలిపినట్లు, ఇసుక సిమెంట్‌ను కలిపినట్లుగా అటూ, ఇటూ తిప్పుతుంది. ఇలా దుస్తులను ఇనుప పారతో మిక్సింగ్ చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Woman Funny Viral Video: అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చపాతీలు చేస్తున్న యువతి నిర్వాకం చూస్తే..


చూస్తుంటే ఆమె ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె బట్టలు ఉతకడాన్ని ఎంతో సులభతరం చేసిందిగా’’.. అంటూ కొందరు, ‘‘బట్టలను ఇలాక్కూడా ఉతకొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 3.65 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దొంగలు కూడా షాకయ్యే ఐడియా.. ఈ పొలంలోకి అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 11:14 AM