Jugad Viral Video: బెడ్‌పైనే షికారు.. ఇతడి టాలెంట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 02 , 2025 | 09:23 AM
ఓ వ్యక్తి మంచంతో చేసిన ప్రయోగం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచంపై పడుకోవడం ఓకే గానీ.. అదే మంచంపై ఎందుకు ప్రయాణించకూడదు.. అనే సందేహం వచ్చినట్లుంది. ఇంకేముందీ... ఆలోచన వచ్చిందో తడవుగా తన టాలెంట్‌కు పదును పెట్టాడు. చివరకు అతడు చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాత వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చడం చూస్తుంటాం. ఇలాంటి ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కులుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచంతో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బెడ్‌పైనే షికారు.. ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మంచంతో చేసిన ప్రయోగం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచంపై పడుకోవడం ఓకే గానీ.. అదే మంచంపై ఎందుకు ప్రయాణించకూడదు.. అనే సందేహం వచ్చినట్లుంది. ఇంకేముందీ... ఆలోచన వచ్చిందో తడవుగా తన టాలెంట్‌కు పదును పెట్టాడు.
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
తన ఇంట్లోని డబుల్ కాట్ మంచాన్ని తీసుకుని, దాని మధ్యలో ఓ రంధ్రం చేశాడు. అందులో ఇంజిన్‌తో పాటూ స్టీరింగ్, గేర్ తదితరాలను ఏర్పాటు చేశాడు. అలాగే మంచానికి నాలుగు వైపులా నాలుగు టైర్లను కూడా ఫిట్ చేశాడు. ఇలా మొత్తం సెట్ చేశాక.. మంచాన్ని (man turned his bed into vehicle) రయ్యి రయ్యిమంటూ రోడ్డుపై పరుగులు పెట్టించాడు. మంచం ఇలా రోడ్డుపై పరుగులు తీయడం చూసి అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. దూరం నుంచి చూసేందుకు మంచానికి ప్రాణం వచ్చి, రోడ్డుపై దూసుకెళ్తోందా.. అనే సందేహం వచ్చేలా ఉంటుంది.
మొత్తానికి ఇలా వినూత్నంగా ఆలోచించి, మంచాన్ని వాహనంలా మార్చిన ఈ వ్యక్తిని అంతా అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘భార్య కొడితే.. మంచంపైనుంచే పారిపోవచ్చుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా లైక్‌లు, 30. 5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Auto Viral Video: లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా.. ఆటోను చూసి అవాక్కవుతున్న జనం..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..