Share News

Viral Video: ఆకలితో ఉన్న పులి.. ఎదురుగా వచ్చిన పంది.. చివరికి జరిగింది చూస్తే.. గూస్ బమ్స్ ఖాయం..

ABN , Publish Date - Jan 04 , 2025 | 08:51 PM

పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మామూలుగానే పులి వేట భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇక ఆకలితో ఉన్న పులికి ఏదైనా జంతువు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులి వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా..

Viral Video: ఆకలితో ఉన్న పులి.. ఎదురుగా వచ్చిన పంది.. చివరికి జరిగింది చూస్తే.. గూస్ బమ్స్ ఖాయం..
Tiger Attack Videos

పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మామూలుగానే పులి వేట భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇక ఆకలితో ఉన్న పులికి ఏదైనా జంతువు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులి వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, పులి వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆకలితో ఉన్న పులికి ఓ పంది ఎదురుగా వచ్చింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే దానికి ఎలాంటి జంతువూ కనిపించదు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పంది పులి ఉన్న ప్రాంతానికి వస్తుంది. పులికి ఎదురుగా రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోతుంది.

Viral Video: మానవత్వం మంటగలిసిన వేళ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను.. కాపాడాల్సింది పోయి..


అప్పటికే ఆకలితో ఉన్న పులి.. పందిని చూడగానే ఒక్కసారిగా (Tiger attack on pig) పంజా విసిరి మెడ కొరికేస్తుంది. పులి దాడితో పంది షాక్ అవుతుంది. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా పులి మాత్రం పందిని వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంటుంది. పంది మెడ పట్టుకుని రౌండ్లు తిప్పుతూ ఉంటుంది. పంది కూడా దాని దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రెండు కలిసి రౌండ్లు రౌండ్లు తిరుగుతూ ఉంటాయి.

Viral Video: వికలాంగుడు రైలు ఎక్కాలని చూడగా తెరుచుకోని డోర్లు.. చివరకు అతడి నిర్వాకంతో..


ఈ ఘటనలో పంది పులికి ఆహారమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి వేట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పందిని చూస్తుంటే ఎంతో జాలేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2025 | 08:51 PM