Viral Video: వికలాంగుడు రైలు ఎక్కాలని చూడగా తెరుచుకోని డోర్లు.. చివరకు అతడి నిర్వాకంతో..
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:52 PM
రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్ర పనులు చేస్తూ నెటట్టింట వైరల్ అవుతుంటారు. ఇంకొందరికి రైలు ఎక్కి, దిగే సమయాల్లో ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి..
రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్ర పనులు చేస్తూ నెటట్టింట వైరల్ అవుతుంటారు. ఇంకొందరికి రైలు ఎక్కి, దిగే సమయాల్లో ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వికలాంగుడు రైలు ఎక్కాలని చూడగా డోర్లు తెరుచుకోలేదు. దీంతో చివరకు అతడి చేసిన నిర్వాకంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వికలాంగుడు రైలు కోసం ఫ్లాట్‌పామ్‌పై వేచి చూస్తుంటాడు. ఇంతలో రైలు వచ్చి ఆగుతుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు ఆగగానే సదరు వికలాంగుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు లాక్ చేసేస్తారు. ఎంతసేపు పిలిచినా డోర్లు తీయకపోవడంతో అతడికి కోపం కట్టలు తెంచుకుంటుంది.
ముందూ వెనుకా చూడకుండా తన చేతిలోని కర్రతో డోరు అద్దాలను బాదుతాడు. అయినా ప్రయాణికులు డోర్లు తీయరు. దీంతో (Disabled man broke the train window glasses) అతను పదే పదే డోర్లపై కొడుతూనే ఉంటాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే పోలీసు కానిస్టేబుల్.. అక్కడికి చేరుకుని వికలాంగుడికి సర్దిచెబుతాడు. వేరే బోగీలోకి వెళ్లాలని సూచించడంతో అతను శాంతిస్తాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: వీడెవడండీ బాబూ.. వేదికపైనే వధువును ముద్దు అడిగేయడంతో.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రభుత్వ ఆస్తులను ఇలా ధ్వంసం చేయడం నేరం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘డోర్లు తీయకుండా లాక్ చేసుకోవడం ప్రయాణికుల తప్పు.. అలా చేస్తే రైలు ఎలా ఎక్కుతారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..