Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:25 AM
వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు మోసుకొచ్చిన బంధువులు.. కట్టెలు పేర్చి దానిపై పడుకోబెట్టారు. అనంతరం కాసేపటి తర్వాత చితికి నిప్పు కూడా పెట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్‌గా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. అలాగే మరణం అంచులదాకా వెళ్లిన వారు కొన్నిసార్లు అనుకోకుండా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి మిరాకిల్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టి నిప్పు పెట్టారు. అయితే మంటలు అంటుకోగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు మోసుకొచ్చిన బంధువులు.. కట్టెలు పేర్చి దానిపై పడుకోబెట్టారు. అనంతరం కాసేపటి తర్వాత చితికి నిప్పు కూడా పెట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Jugad Viral Video: బెడ్‌పైనే షికారు.. ఇతడి టాలెంట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
అప్పటిదాకా శవంలా పడి ఉన్న వ్యక్తి కాస్తా.. మంటలు అంటుకోగానే ఒక్కసారిగా పైకి లేచి (old man alive from the pyre) చితిపై నుంచి కిందకు పారిపోయాడు. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు అతన్ని వింతగా చూడగా.. మరికొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’..అంటూ కొందరు, ‘‘చనిపోయాననే విషయాన్ని తాత మర్చిపోయాడు..అందుకే గుర్తొచ్చి బతికొచ్చాడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..