Viral Video: గడ్డ కట్టిన నీటిలో ఇరుక్కున్న మొసలిని చూసి పాపం అనుకున్నారు.. చివరకు సమీపానికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు..
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:54 PM
నీటిలో ఉండే మొసళ్లకు ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువునైనా చిటికెలో వేటాడేస్తాయి. అందుకే నీటిలో మొసళ్లను చూడగానే జంతువులన్నీ ఆమడదూరం పారిపోతుంటాయి. మొసళ్లు చాలా సేపు నీటి అడుగున ఉంటూ తెలివిగా వేటాడుతుంటాయి. ఇలాంటి..
నీటిలో ఉండే మొసళ్లకు ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువునైనా చిటికెలో వేటాడేస్తాయి. అందుకే నీటిలో మొసళ్లను చూడగానే జంతువులన్నీ ఆమడదూరం పారిపోతుంటాయి. మొసళ్లు చాలా సేపు నీటి అడుగున ఉంటూ తెలివిగా వేటాడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా గడ్డ కట్టిన నీటిలో మొసలి వీడియో తెగ వైరల్ అవుతోంది. మంచు నీటిలో చలనం లేకుండా పడి ఉన్న మొసలిని చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు.. తీరా సమీపానికి వెళ్లి చూసి షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతల కారణంగా ఓ నదిలోని నీరు గడ్డకట్టుకుపోయింది. అక్కడికి వెళ్లిన పర్యాటకులకు ఓ షాకింగ్ సీన్ కనిపించింది. గడ్డ కట్టిన నీటి అడుగున ఓ మొసలి ( crocodile stuck in frozen water) ఇరుక్కుపోయి ఉండడాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. మొసలి చనిపోయిందనుకుని అంతా అయ్యో పాపం అని జాలిపడ్డారు.
అయితే కొందరు వీడియో తీసే క్రమంలో సమీపానికి వెళ్లగా షాకింగ్ సీన్ కనిపించింది. అప్పటిదాకా చలనం లేకుండా పడి ఉన్న మొసలి కాస్తా.. అటూ, ఇటూ కదులడం చూసి వారంతా ఖంగుతిన్నారు. మొసలి తన మూతిని బయటికి పెట్టి, శ్వాస తీసుకోవడాన్ని గమనించవచ్చు. మొసళ్లు నిద్రాణ స్థితికి వెళ్లిన సమయంలో ఇలా తమ ముక్కును నీటి ఉపరితలంపై ఉంచి శరీరాన్ని స్థిరంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ మొసలి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 6.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. వీళ్ల పవర్ మామూలుగా లేదుగా.. ఏకంగా చిరుతల ఆహారాన్నే లాగేయడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..