Theft Viral Video: ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:29 PM
జనం మధ్యలో ఓ యువకుడు నిలబడి అందరినీ గమనిస్తుంటాడు. తన ఎదరుగా ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌ను జేబులో పెట్టుకుని ఉంటాడు. అతడి ఫోన్‌పై కన్నేసిన దొంగ.. బుద్ధివంతుడిలా చేతులు కట్టుకుని నిలబడతాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

దొంగలు చోరీలు చేయడంలో కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. పక్కనే నిలబడి మరీ పని కానిచ్చేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు, చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫోన్‌ను చొక్కా జేబులో పెట్టుకున్న ఓ వ్యక్తికి దొంగ సడన్ షాక్ ఇచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జనం మధ్యలో ఓ యువకుడు నిలబడి అందరినీ గమనిస్తుంటాడు. తన ఎదరుగా ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌ను జేబులో పెట్టుకుని ఉంటాడు. అతడి ఫోన్‌పై కన్నేసిన దొంగ.. బుద్ధివంతుడిలా చేతులు కట్టుకుని నిలబడతాడు.
అలా నిలబడిన తర్వాత ఓ చేత్తో సైలెంట్‌గా (Thief cleverly stole the phone) ఆ వ్యక్తి జేబులోని ఫోన్‌ను తీసుకుంటాడు. అయితే అతను ఫోన్ తీసుకున్న వెంటనే ఆ వ్యక్తి అలెర్ట్ అవుతాడు. ఫోన్ తీసుకున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా అప్రమత్తంగా ఉంటే చోరీకి గురయ్యే అవకాశమే ఉండదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..