Viral Video: టెన్నిస్ ఆడుతున్న యువతి.. సడన్‌గా పక్కనే పడ్డ పిడుగు.. చివరకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 09:31 AM
ఓ వ్యక్తితో కలిసి యువతి టెన్నిస్ ఆడుతుంటుంది. అదే సమయంలో సన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. అయినా వారు టెన్నిస్ ఆడుతూనే ఉంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి పక్కనే పిడుగు పడడంతో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడడం సర్వసాధారణం. అలాగే చెట్లు, ఏత్తైన భవానల మీద పిడుగులు పడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో చాలా మంది చెట్ల కిందకు వెళ్లడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అయితే కొందరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి టెన్నిస్ ఆడుతుండగా.. పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో కలిసి యువతి టెన్నిస్ (young woman playing tennis) ఆడుతుంటుంది. అదే సమయంలో సన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. అయినా వారు టెన్నిస్ ఆడుతూనే ఉంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
పక్కనే ఉన్న చెట్టుపై ఫెడేల్‌మని శబ్ధం చేసుకుంటూ (Lightning fell on Tree) పిడుగు పడుతుంది. దెబ్బకు ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి, టెన్నిస్ బ్యాట్ కింద పడేసి చెవులు మూసుకుంటుంది. తర్వాత ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. పిడుగు చెట్టుపై పడడం, దాని కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘వర్షం పడుతున్న సమయంలో చెట్ల వద్ద ఉండడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..