Train Accident Viral Video: రన్నింగ్ రైల్లో షాకింగ్ సీన్.. అంకుల్‌పై యువకుడి దాడి.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:45 AM
ఓ యువకుడికి, ఓ అంకుల్‌కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో యువకుడు చేతిలో బ్లేడు పట్టుకుని అంకుల్‌పై దాడికి పాల్పడతాడు. ఎంత అడ్డుకుంటున్నా పదే పదే బ్లేడుతో దాడి చేయాలని చూస్తాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

రైళ్లలో చోటు చేసుకునే విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ, మరికొందరు అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ .. చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్నిసార్లు చోటు చేసుకునే ఘటనలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ యువకుడు ఓ అంకుల్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో చివరకు ఆ వ్యక్తి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి, ఓ అంకుల్‌కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో యువకుడు చేతిలో బ్లేడు పట్టుకుని అంకుల్‌పై దాడికి పాల్పడతాడు. ఎంత అడ్డుకుంటున్నా పదే పదే బ్లేడుతో దాడి చేయాలని చూస్తాడు.
Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
యువకుడు దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన అంకుల్ .. ఆ యువకుడి చేయి పట్టుకుని నెట్టుకుంటూ వెళ్తాడు. చివరకు అతన్ని (Uncle Threw boy Out Of Moving Train) డోరు వద్ద నుంచి కిందకు నెట్టేస్తాడు. ఆ తర్వాత తాపీగా వచ్చి సీట్లో కూర్చొంటాడు. దీంతో లోపల ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
Viral Video: టెన్నిస్ ఆడుతున్న యువతి.. సడన్‌గా పక్కనే పడ్డ పిడుగు.. చివరకు ఏమైందో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతను బ్లేడుతో దాడి చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా కిందకు తోసేశాడు’’.. అంటూ కొందరు, ‘‘అలా చేయకుండా పోలీసులకు అప్పగించి ఉంటే బాగుండేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..