Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:40 AM
ఓ వ్యక్తి బెడ్‌పై పడుకుని నిద్రపోతున్నాడు. అతడి చేతికి కట్టు కట్టి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతడి చేతికి ఏదో గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతడి పెంపుడు పిల్లికి కూడా అర్థమైనట్లు ఉంది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

దాదాపు ప్రతి ఇంట్లో కుక్క, పిల్లిని పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. ఎలుకల బాధ తాళలేక కొందరు, ఇంటికి రక్షణా ఉండాలని మరికొందరు వీటిని పోషిస్తుంటారు. కారణాలు ఏవైనా ఈ రెండు పెంపుడు జంతువులుగా మనుషులతో మమేకం అయిపోయాయని చెప్పొచ్చు. కొన్ని మనుషులపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంటాయి. తమ యజమానికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు. ఏదో ఒక రూపంలో తమ ప్రేమను చూపిస్తూ విశ్వాసం కనబరుస్తుంటాయి. ఇలాంటి ఆసక్తికర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన యజమానికి చేతికి గాయమవడం చూసి ఓ పిల్లి చలించిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బెడ్‌పై పడుకుని నిద్రపోతున్నాడు. అతడి చేతికి కట్టు కట్టి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతడి చేతికి ఏదో గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతడి పెంపుడు పిల్లికి (Cat) కూడా అర్థమైనట్లు ఉంది. తన యజమానికి దెబ్బ తగలడం చూసి తట్టుకోలేకపోయింది.
Skin Care: వేసవిలో మీ చర్మం సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు..
పరుగెత్తుకుంటూ వెళ్లి మంచం పైకి ఎక్కి తన యజమాని చేయి పక్కనే పడుకుంది. ‘‘అయ్యో.. బాసూ.. నీకెంత కష్టం వచ్చింది.. ఇన్నాళ్లూ నన్ను చూసుకున్నావు.. ఈ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటా’’.. అన్నట్లుగా తన యజమాని చేయిపై తన కాలు పెట్టి ప్రేమగా నిమురుతోంది. మధ్య మధ్యలో చేతికి తగిలిన దెబ్బలు చూస్తూ బాధపడుతుంది. ఆ వెంటనే తన కాలితో జోకొడుతూ ధైర్యం చెబుతుందన్నమాట.
ఇలా తనపై తన పిల్లి ప్రేమ చూపించడం (cat showing love for its owner) చూసి ఆ యజమాని ఎంతో మురిసిపోయాడు. ఈ ఘటనను వీడియో తగీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ పిల్లి మనసు ఎంత గొప్పది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 49 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..