Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:39 AM
ఓ వివాహ కార్యక్రమంలో ఫొటోషూట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులకు సినిమా తరహా షాట్స్ తీసేందుకు కెమెరామెన్ ఏర్పాట్లు చేశాడు. వరుడు వధువును ఎత్తుకోగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుత వివాహాలు సినిమా సీన్లను తలదన్నేలా ఉంటున్నాయి. ఒకరిని మించి మరొకరు కొత్తకొత్తగా ఆలోచిస్తూ పెళ్లిళ్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి సంఘటననూ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రీవెడ్డింగ్ షూట్‌ను కూడా గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. అయితే ఇలాంటి పనులు కొన్నిసార్లు వధూవరుల ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫొటోషూట్‌లో వరుడు వధువును ఎత్తుకోగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో ఫొటోషూట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులకు సినిమా తరహా షాట్స్ తీసేందుకు కెమెరామెన్ ఏర్పాట్లు చేశాడు. వరుడు వధువును ఎత్తుకోగానే వెనుక పెద్ద పేలుడు సంభవించి, అందులో నుంచి రంగులు బయటికి రావాలి.
ఇందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే కెమెరా ఆన్ చేయగానే వరుడు వధువును పైకి ఎత్తుకున్నాడు. అదే సమయంలో వారి పక్కనే బాంబ్‌ను పేల్చారు. బాంబ్ పేలి రంగులు కూడా బయటికి వచ్చాయి. అయితే పేలుడు దాటికి నిప్పు వచ్చి వధువు వీపు మీద పడ్డాయి. దీంతో వధువు ఒక్కసారిగా షాక్ అయింది. ఈ ఘటనతో ఆమె జుట్టు కాలిపోవడంతో పాటూ (Bride injured in explosion) శరీరంపై స్వల్ప గాయాలయ్యాయి.
Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టెక్నాలజీ వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్లాన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: టెన్నిస్ ఆడుతున్న యువతి.. సడన్‌గా పక్కనే పడ్డ పిడుగు.. చివరకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..