Share News

Woman Viral Video: ఫోన్ పట్టుకుని పట్టాలపై పడుకున్న మహిళ.. సడన్‌గా దూసుకొచ్చిన రైలు..చివరకు అంతా అవాక్కయ్యే సీన్..

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:42 PM

ఓ మహిళ రైలు పట్టాలపై వినూత్నంగా రీల్ చేయాలని అనుకుంది. రైలు పట్టాలపైకి వెళ్లిన ఆమె.. వాటి మధ్యలో పడుకుని, రెండు చేతులూ ముందుకు చాపి ఫోన్ పట్టుకుని కెమెరా ఆన్ చేసింది. కాసేపటి తర్వాత రైలు అటుగా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Woman Viral Video: ఫోన్ పట్టుకుని పట్టాలపై పడుకున్న మహిళ.. సడన్‌గా దూసుకొచ్చిన రైలు..చివరకు అంతా అవాక్కయ్యే సీన్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రాణాంతకమైన పనులు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైలు పట్టాలపై పడుకుని వీడియో తీస్తోంది. ఇంతలో రైలు సమీపానికి దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రైలు పట్టాలపై వినూత్నంగా రీల్ చేయాలని అనుకుంది. రైలు పట్టాలపైకి వెళ్లిన ఆమె.. (Woman lying between train tracks) వాటి మధ్యలో పడుకుని, రెండు చేతులూ ముందుకు చాపి ఫోన్ పట్టుకుని కెమెరా ఆన్ చేసింది. కాసేపటి తర్వాత ఎదురుగా రైలు దూసుకొచ్చింది.

Snake Viral Video: పిల్లలతో కలిసి ఇంటి ముందున్న తల్లి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు జరిగింది చూస్తే..


రైలు దూసుకొస్తున్నా కూడా ఆమె ధైర్యంగా ఫోన్ పట్టుకుని అలాగే పడుకుంది. రైలు ఆమె మీదుగా దూసుకెళ్లింది. ఇదంతా ఆ ఫోన్‌లో రికార్డ్ అయింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. రైలు పట్టాలపై మహిళ పడుకుంది నిజమే కానీ.. తర్వాత ఫోన్ మాత్రమే అక్కడ పెట్టి, ఆమె పక్కకు వచ్చేసింది. రైలు వస్తున్న దృశ్యాలన్నీ ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. అయితే రెండు సీన్‌లను కలిపి చూడడం వల్ల ఆమే రైలును వీడియో తీసినట్లుగా అనిపిస్తుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఏడో మనిషిని 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు పర్‌ఫెక్ట్‌‌గా ఉన్నట్లే..


అయినా ఇలంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం ప్రమాకరమని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెను చూసి మిగతా వారు కూడా నేర్చుకుంటారు’’.. అంటూ కొందరు, ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 8.59 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2025 | 01:42 PM