Snake Viral Video: పిల్లలతో కలిసి ఇంటి ముందున్న తల్లి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:20 PM
ఓ మహిళ ప్లాస్టిక్ బుట్టలో దుస్తులు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇంతలో తలుపు ముందు తన ఇద్దరు పిల్లలు నిలబడి ఉంటారు. అయితే ఇదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

ఇళ్లలోకి పాములు చొరబడే ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లు, మంచాలు, గ్యాస్ స్టవ్‌లు.. ఆఖరికి సీలింగ్ ఫ్యాన్లలో కూడా కనిపిస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణాలు పోయేంత పనవుతుంటుంది. అయితే కొందరు అదృష్టం బాగుండి.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంటి బయట ఉండగా.. సడన్‌గా ఓ పాము దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (Woman) ప్లాస్టిక్ బుట్టలో దుస్తులు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇంతలో తలుపు ముందు తన ఇద్దరు పిల్లలు (Childrens) నిలబడి ఉంటారు. అయితే ఇదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పాము సడన్‌గా అక్కడికి దూసుకొస్తుంది.
పామును (Snake) చూసిన చిన్నారి భయంతో ఓ మూలకు వెళ్లిపోతుంది. ఇంతలో తల్లి అలెర్ట్ అయి పాపు తన వద్దకు లాక్కుటుంటుంది. పామును తొక్కుతున్న సమయంలో ఎంతో చాకచక్యంగా పక్కకు లాగేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత తలుపు వద్దే నిలబడి ఉన్న మరో చిన్నారిని కూడా దగ్గరికి తీసుకుంటుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.
DJ Funny Viral Video: డీజేని ఎక్కడ వాడాలో వీళ్లకు బాగా తెలుసనుకుంటా.. ఇది కదా పనితనం అంటే..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. పెద్ద ప్రమాదం తప్పిపోయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.58 లక్షలకు పైగా లైక్‌లు, 64.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..