Bride Funny Video: మేకప్ చెదిరినా పర్లేదు దీన్ని మాత్రం వదిలేదే లేదు.. వధువు నిర్వాకానికి అంతా షాక్..
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:32 PM
ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం వధూవరులు భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. వారి ముందు నోరూరించే మటన్ బిరియాని సిద్ధంగా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..

పెళ్లిళ్లలో వధువు సాధారణంగా సిగ్గుపడుతూ కనిపిస్తుంటుంది. పది మందిలో ఏం చేయాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే కొందరు వధువులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. వరుడికి షాక్ ఇస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా , ఓ వధువు విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడి పక్కనే కూర్చున్న వధువు.. నల్లిబొక్కను తినే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘నల్లిబొక్క తినడంలో ఈ వధువు స్పెషలిస్ట్ అనుకుంటా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం వధూవరులు భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. వారి ముందు నోరూరించే మటన బిరియాని సిద్ధంగా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అమ్మాయిలు భోజనం ఎంతో నైస్‌గా చేయడం చూస్తుంటాం. అందులోనూ పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువులు.. మరింత నీట్‌గా భోజనం చేస్తుంటారు.
అయితే ఈ వధువు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. నల్లిబొక్కను చేతిలోకి తీసుకున్న వధువు.. (Bride eating nalli nihari) ఎముక రంధ్రలోని మాంసాన్ని బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎముకను చేతిపై కొట్టడం, తల కిందులు చేసి ప్లేటుపై కొట్టడం వంటి పనులు చేస్తుంది. ఈ క్రమంలో ఆమె మేకప్‌తో పాటూ జుట్టు కూడా చెదిరిపోతుంది. అయినా తగ్గేదేలే.. అన్నట్లుగా ఆమె ఎముకను చప్పరిస్తూనే ఉంటుంది. మధ్యలో వరుడు చెదిరిపోయిన ఆమె జుట్టును సరిచేసి మరింత ఎంకరేజ్ చేస్తాడు.
Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
ఇలా చివరకు ఎముక రంధ్రలో తన వేలి గోరును పెట్టి మాంసాన్ని బయటికి తీసి మరీ లాగించేస్తుంది. ఇలా ఈ వధువు నల్లిబొక్కను విచిత్రంగా తింటూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నల్లిబొక్కను ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘చివరకు మిషన్ సక్సెస్‌ఫుల్ చేసిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 16.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెన్నిస్ ఆడుతున్న యువతి.. సడన్‌గా పక్కనే పడ్డ పిడుగు.. చివరకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో ఈ పామేంటీ ఇలా చేసిందీ.. బాత్రూంలో దీని నిర్వాకం చూస్తే..

హెూటల్ బాత్రూంలో టెలిఫోన్ ఎందుకుంటుంది..

ఈ చిత్రంలో దాక్కుని ఉన్న హుక్‌ను 20 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

కుక్కతో రైలెక్కాలని చూశాడు.. చివరకు జరిగింది చూస్తే ..

హద్దులు మీరిన ప్రేమ జంట.. దూరంగా కెమెరాను చూసి షాక్..
