Viral Video: చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే.. ఎలా కొట్టేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:39 PM
ఇద్దరు యువకులు దుస్తుల దుకాణంలోకి వెళ్లారు. వారిలో ఓ వ్యక్తి దుకాణ యజమానిని టవల్ చూపించమని అడుగుతాడు. దీంతో దుకాణ యజమాని తన వెనుకే ఉన్న ఓ టవల్ తీసి అతడి చేతికి ఇస్తాడు. ఈ క్రమంలో అతను చోరీ విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

దొంగలు రోజురోజుకూ తెలివి మీరిపోతున్నారు. కొందరు పాత పద్ధతిలో రాత్రి వేళ ఇళ్ల తాళాలు తీసి చోరీలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఏకంగా పట్టపగలే పక్కనే నిలబడి కళ్లుగప్పి డబ్బులు కొట్టేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ దొంగ వినూత్నంగా చేసిన చోరీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు దుస్తుల దుకాణంలోకి (clothing store) వెళ్లారు. వారిలో ఓ వ్యక్తి దుకాణ యజమానిని టవల్ చూపించమని అడుగుతాడు. దీంతో దుకాణ యజమాని తన వెనుకే ఉన్న ఓ టవల్ తీసి అతడి చేతికి ఇస్తాడు. టవల్‌ను చేతుల్లోకి తీసుకున్న అతను.. కాసేపు పరిశీలిస్తాడు.
Viral Video: ఫోన్లలో బిజీగా ఉన్న ప్రయాణికులు.. సడన్‌గా లోపలికి దూరిన ఎద్దు.. చివరకు..
ఆ తర్వాత తనకు వేరే ఇంకో టవల్ కావాలంటూ ముందుకు వంగి.. దుకాణ యజమానికి వెనుక ఉన్న దుస్తుల వైపు చేయి చూపిస్తాడు. దీంతో యజమాని కూడా తన వెనకకు చూస్తాడు. ఇంతలో మరో చేత్తో డ్రాయర్‌లో ఉన్న నోట్ల కట్టలను (Thief Stole Cash) తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత తాపీగా తనకు ఆ టవల్ నచ్చలేదంటూ అక్కడే పెట్టి ఆ ఇద్దరూ అక్కడి నుంచి జారుకుంటారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Viral Video: కారును ఓవర్‌టేక్ అయితే చేశారు గానీ.. ముందు వైపు చూసి ఖంగుతిన్నారు..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ దొంగ తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘చోరీలో పీజీ చేసినట్టున్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..