Viral Video: వీడెవండీ బాబోయ్.. జనరల్ బోగీని కాస్తా స్లీపర్‌గా ఎలా మార్చాడో చూడండి..
ABN , Publish Date - Feb 11 , 2025 | 08:26 PM
రైల్లోని జనరల్ బోగీలో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. సీటు కాదు కదా అడుగు తీసి అడుగు వేయడానికీ స్థలం లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

రైళ్లలో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొందరు నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు సీట్ల కోసం చిత్ర విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుతంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి జనరల్ బోగీలో సీటు కోసం చివరకు పెద్ద సాహసమే చేశాడు. సీటు లేకున్నా చివరకు స్లీపింగ్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లోని జనరల్ బోగీలో (general bogie) ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. సీటు కాదు కదా అడుగు తీసి అడుగు వేయడానికీ స్థలం లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి విపరీతమైన నిద్ర వచ్చేసినట్టుంది. అయితే పడుకుందామంటే సీటు కనిపించలేదు, కనీసం కాస్త స్థలం కూడా లేదు.
అయినా ఎలాగైనా సరే పడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సీటు కోసం చూడడం కంటే మనకే క్రియేట్ చేయడం బెటర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బ్యాగులో ఉన్న ప్లాస్టిక్ తాడును బయటికి తీశాడు. సీట్ల పైన ఉండే కడ్డీల మధ్యలో ఒవైపు నుంచి మరో వైపునకు తాడును దూర్చాడు. ఇలా కాసేపటికి మంచంపై నులకను అల్లిన చందంగా మొత్తం అల్లేశాడు. ఇలా తాడును ఊయల తరహాలో కట్టిన తర్వాత.. దానిపై దుప్పటి కప్పుకొని హాయిగా పడుకున్నాడు.
Viral Video: తక్కువకే వస్తోందని పనీర్ బ్రెడ్ పకోడీ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే ఖంగుతింటారు..
ఇలా సీటు లేకపోయినా తానే స్వయంగా క్రియేట్ చేసుకుని మరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు మార్గాన్ని కనుకొనలేదు.. సృష్టించాడు’’.. అంటూ కొందరు, ‘‘స్లీపర్ సీటును ఇలాక్కూడా క్రియేట్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 5.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..