Viral Video: కారును ఓవర్‌టేక్ అయితే చేశారు గానీ.. ముందు వైపు చూసి ఖంగుతిన్నారు..
ABN , Publish Date - Feb 11 , 2025 | 09:51 PM
రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ ఎర్రటి కారు వేగంగా పరుగులు తీస్తుంటుంది. దాని వెనుకే మరో కారులో కొందరు వెళ్తుంటారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటన్నారా. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

చిత్రవిచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను తయారుచేస్తుంటారు. కొందరు బైకును కారు తరహాలో మారిస్తే.. మరికొందరు కారు లాంటి ఎద్దుల బండిని సిద్ధం చేస్తారు. ఇంకొందరేమో సైకిల్ చక్కాలు, ఇంజిన్‌తో ఏకంగా గుర్రపు బండినే తయారు చేస్తారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారును ఓవర్‌టేక్ చేసిన వారు.. దాని ముందు వైపు చూసి ఖంగుతిన్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ ఎర్రటి కారు వేగంగా పరుగులు తీస్తుంటుంది. దాని వెనుకే మరో కారులో కొందరు వెళ్తుంటారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటన్నారా. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: ఇందుకే నాన్నను రియల్ హీరో అనేది.. కిండపడుతున్న బిడ్డను ఎలా పట్టుకున్నాడో చూస్తే..
కారులో ఉన్న వారికి తమ ముందున్న ఎర్ర కారును చూడగానే అనుమానం కలిగింది. దీంతో అసలు విషయం ఏంటీ అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో కారును ఓవర్‌టేక్ చేశారు. కారును ఓవర్‌టేక్ చేసి ముందు వైపు చూసి షాక్ అయ్యారు. వెనుక కారులాగే కనిపిస్తున్నా.. ముందు మాత్రం బైకు కనిపించింది. సగం కారును, సగం బైకును కలిపి (Half car and half bike) ఇలా విచిత్రంగా తయారు చేశారన్నమాట.
ఈ విచిత్ర వాహనం చూసి దారిన వెళ్లే వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. పాకిస్థాన్‌లో మాత్రమే ఇలాంటి సాధ్యం.. అని పేర్కొంటూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాకిస్తాన్‌లో కూడా ఇలాంటి వారికి కొదవ లేదన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీడెవండీ బాబోయ్.. జనరల్ బోగీని కాస్తా స్లీపర్‌గా ఎలా మార్చాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..