Viral Video: తక్కువకే వస్తోందని పనీర్ బ్రెడ్ పకోడీ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే ఖంగుతింటారు..
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:14 PM
తక్కువకే వస్తోందని ఓ వ్యక్తి రూ.20 ఖర్చు చేసి పనీర్ బ్రెడ్ పకోడీ కొన్నాడు. అయితే దాన్ని తినాలని చూడగా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్రెడ్ మధ్యలోని పనీర్‌ను చూడగానే అతడికి అనుమానం కలిగింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

కొందరు వ్యాపారులు భోజన ప్రియులను ఆకర్షించేలా అనేక రకాల వంటకాలను సిద్ధం చేస్తుంటారు. కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలను చేస్తూ కొందరు, ఎవరూ ప్రయత్నించని విధంగా వినూత్నంగా వంటకాలను సిద్ధం చేస్తూ మరికొందరు.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్ని ఆహార పదార్థాలను చూసి షాక్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇలాంటి ఫుడ్ వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పనీర్ బ్రెడ్ పకోడీ తినాలని చూసి చివరకు ఖంగుతిన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తక్కువకే వస్తోందని ఓ వ్యక్తి రూ.20 ఖర్చు చేసి పనీర్ బ్రెడ్ పకోడీ (Paneer is Bread Pakora) కొన్నాడు. అయితే దాన్ని తినాలని చూడగా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్రెడ్ మధ్యలోని పనీర్‌ను చూడగానే అతడికి అనుమానం కలిగింది. ఇంతకీ దాని సంగతేంటో చూడాలని పరీక్షించేందుకు సిద్ధమయ్యాడు. అయోడిన్ ద్రావణాన్ని తీసుకుని పనీర్‌పై పోస్తాడు.
ఇలా పోయగానే తెల్లగా ఉన్న పనీర్ కాస్తా.. రంగు మారి నల్లగా మారిపోతుంది. అది నకిలీ పనీర్ (Fake Paneer) అని తేల్చేందుకు.. తన వెంట తెచ్చుకున్న ఒరిటిజనల్ పనీర్‌ను తీసుకుని, అదే ద్రావణాన్ని దానిపై పోస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా దాని రంగు మాత్రం మారదు. దీన్నిబట్టి బ్రెడ్ మధ్యలో ఉన్న పనీర్.. నకిలీదని అతను తేల్చేస్తాడు. రూ.20 ధరలోనే బ్రెడ్‌తో పాటూ పనీర్ ఇవ్వడం సాధ్యం కాదని, తక్కువగా వస్తోందని ఇలాంటి ఆహారాలను తీసుకోవద్దంటూ సూచిస్తాడు.
Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..
కాగా, ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘వీధుల్లో దొరికే పనీర్ తినడం మానుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘చికెన్ కంటే పనీర్ ఖరీదైనది.. ఇలా తక్కువకే వస్తోందంటే అది ఖచ్చితంగా నకిలీదే అయి ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..