Viral Video: టీచర్ మనసు దోచుకున్న విద్యార్థి.. పరీక్ష పేపర్ చివర్లో రాసింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:57 PM
ఓ టీచర్ విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను తనిఖీ చేస్తుంటాడు. ప్రశ్నలకు సమాధానాలను కరెక్ట్‌గా రాసిన వారికి ఫుల్ మార్కులు వేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో ఓ సమాధాన పత్రం అతడిని ఇంప్రెస్ చేస్తోంది..

విద్యార్థులు అప్పుడప్పుడూ అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా పరీక్షల సమయాల్లో వింత వింత పనులు చేయడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా కాపీ కొడితే.. మరికొందరు పరీక్ష పేపర్‌లో నోటికి వచ్చింది రాస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాగాగా , ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి పరీక్ష పేపర్ చివర్లో రాసింది చూసి టీచర్ ఇంప్రెస్ అయ్యాడు. చివరకు ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ టీచర్ విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను (teacher checking exam papers) తనిఖీ చేస్తుంటాడు. ప్రశ్నలకు సమాధానాలను కరెక్ట్‌గా రాసిన వారికి ఫుల్ మార్కులు వేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో ఓ సమాధాన పత్రం అతడిని ఇంప్రెస్ చేస్తోంది.
Viral Video: తక్కువకే వస్తోందని పనీర్ బ్రెడ్ పకోడీ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే ఖంగుతింటారు..
ముందు రాసిన సమాధానాలను చూస్తూ మార్కులు వేస్తూ చివరి పేజీ చూస్తాడు. అక్కడ ఆ విద్యార్థి రాసిన కొటేషన్ (Student Quotation) చూసి టీచర్ ఆగిపోతాడు. ‘‘అంతా నువ్వు ఓడిపోవాలని ఎదురు చూస్తున్న సమయంలో గెలవడం సరదాగా ఉంటుంది’’.. అని రాశాడు. అది చూడగానే టీచర్ సంతోషంతో ఆ విద్యార్థిని మెచ్చకుంటాడు. ఏమాత్రం ఆలోచించకుండా అందులో 80కి 80 మార్కులు వేసేస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ విద్యార్థి ఎవరో గానీ చాల తెలివిపరుడిలా ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘చాలా మంది కొటేషన్ రాశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3800కి పైగా లైక్‌లు, 3.32 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..