Viral Video: ఫోన్లలో బిజీగా ఉన్న ప్రయాణికులు.. సడన్‌గా లోపలికి దూరిన ఎద్దు.. చివరకు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:02 PM
ఎక్కడి నుంచి వచ్చిందే ఏమో తెలీదు గానీ.. ఓ ఎద్దు బస్సు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులంతా ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ ఎద్దు సడన్‌గా లోపలికి దూరింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వింత వింత ఘటనలు, విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. వీటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న జనం మధ్యలోకి చొరబడే జంతువులు.. కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులోకి దూరిన ఓ ఎద్దు.. చివరకు ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సులో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందే ఏమో తెలీదు గానీ.. ఓ ఎద్దు బస్సు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులంతా ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో (bull entered the bus) ఆ ఎద్దు సడన్‌గా లోపలికి దూరింది.
Viral Video: కారును ఓవర్‌టేక్ అయితే చేశారు గానీ.. ముందు వైపు చూసి ఖంగుతిన్నారు..
అంతవరకూ ఎద్దును ఎవరూ గమనించలేదు. తీరా బస్సు లోపలికి దూరడంతో అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బయటికి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఎద్దు.. బీభత్సం సృష్టించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంతా ఎక్కడికక్కడ అద్దాలను పగులగొట్టుకుని బయటికి దూకేశారు. ఎద్దు బస్సులో అటూ, ఇటూ తిరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎద్దు ఎక్కడ తమ మీదకు దూకేస్తుందో అనే భయంతో అంతా అటూ, ఇటూ పరుగులు తీశారు.
Viral Video: ఇందుకే నాన్నను రియల్ హీరో అనేది.. కిండపడుతున్న బిడ్డను ఎలా పట్టుకున్నాడో చూస్తే..
బస్సు డ్రైవర్‌తో పాటూ మిగిలిన వారు కూడా కిందకు దూకేశారు. ఈ ఘటనతో స్థానికులు అక్కడ గుమికూడారు. కొందరు కలుగజేసుకుని బస్సులోని ఎద్దును కిందకు తరిమేశారు. దీంతో అంతా.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బస్సులోకి ఎద్దు వస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎద్దుకు బస్సు జర్నీ అంటే బాగా ఇష్టమున్నట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..