Share News

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:11 PM

వంట గదిలో చపాతీలు చేస్తున్న ఓ మహిళ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పిండిని తీసుకున్న ఆమె.. దాన్ని చాలా పొడవుగా సాగదీస్తుంది. తర్వాత ఆ పిండిని ప్లాస్టిక్ పైపుతో రోలింగ్ చేస్తుంది. చివరగా..

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

కొందరు మహిళలు ఇళ్లలో చేసే చిత్రవిచిత్రమైన పనులు చూస్తే ఆశ్చర్యం కలుతుగుంది. ఒకరేమో సైకిల్ చక్రాన్ని వాషింగ్ మెషిన్‌గా మార్చితే.. మరొకరేమో వేడి వేడి కుక్కర్‌తో ఇస్త్రీ చేసేస్తుంటారు. ఇంకొందరేమో ఏకంగా ఏకంగా ఇటుకలతో వాషింగ్ మెషిన్‌ను నిర్మిస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకేసారి ఎక్కువ చపాతీలు చేస్తున్న మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట గదిలో చపాతీలు చేస్తున్న ఓ మహిళ (woman making chapatis) అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పిండిని తీసుకున్న ఆమె.. దాన్ని చాలా పొడవుగా సాగదీస్తుంది. తర్వాత ఆ పిండిని ప్లాస్టిక్ పైపుతో రోలింగ్ చేస్తుంది. చివరగా ఓ ఖాళీ క్యారియర్ బాక్స్ తీసుకుని ఆ పిండిపై చపాతీ సైజులో కట్ చేస్తుంది.

Viral Video: ఏనుగు మొండితనం ఎప్పుడైనా చూశారా.. మావటి వెనుక నిలబడి ఏం చేస్తుందో చూడండి..


ఆ తర్వాత చపాతీల చుట్టూ ఉన్న పిండిని తీసేస్తుంది. తర్వాత ఎంచక్కా చపాతీలను తీసుకుని వరుసగా పెనంపై వేసి వేడి చేస్తుందన్నమాట. ఇలా ఒకేసారి ఐదు చపాతీలను చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది. గతంలో ఓ మహిళ చపాతీలను ఇలాగే విచిత్రంగా చేయడం చూశాం. చపాతీ పిండి ఉండలను ప్లాస్టిక్ పేపర్ల మధ్యలో ఒకదానిపై ఒకటి పేర్చి ఒకేసారి రోల్ చేయడం చూశాం. ఇంకో మహిళ అయితే ఏకంగా తన భర్త గుండుపై చపాతీలు చేసి అందరినీ తెగ నవ్వించిన విషయం తెలిసిందే.

Viral Video: రోడ్డు మధ్యలో పిల్లి.. సడన్‌గా ఎంటరైన కుక్క.. చివరికి గుండెలకు హత్తుకునే సీన్...


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్మార్ట్ వర్క్ అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. ఈమె టాలెంట్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లు, 92 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2025 | 12:11 PM