Share News

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు.. విద్యాశాఖ కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 11 , 2025 | 07:32 AM

Sankranti holidays: సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు..  విద్యాశాఖ కీలక ప్రకటన
Sankranti holidays

హైదరాబాద్: సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు పండుగ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పాఠశాలలకే కాకుండా కాలేజీలకూ సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 17 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఏడు రోజుల పాటు సెలవు ప్రకటించింది. అలాగే కళాశాలలకు ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆరురోజుల పాటు కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, కేజీబీవీలు, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలతో సహా అన్ని రకాల కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కొన్ని సూచనలు చేసింది. స్కూళ్లు, జూనియర్ కాలేజీలు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడిపితే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని ప్రకటనలో స్పష్టం చేసింది.

ఏపీలో ఎప్పటివరకంటే..

సంకాంత్రి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది 8 రోజుల పాటు సెలవులు రావడంతో విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: టికెట్‌ రేట్ల పెంపు ఎవరి కోసం..!

High Court: బెనిఫిట్‌ షోలు రద్దంటూ.. స్పెషల్‌ షోకు అనుమతులా?

HMDA: మహా అప్పు కావాలి!

Read Latest AP News and Telangana News

Updated Date - Jan 11 , 2025 | 07:53 AM