Minister Seethakka: ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి సీతక్క ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:31 AM
Minister Seethakka: బీజేపీ నేత రమేష్ బిధూరిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇవాళ(సోమవారం) ఆదిలాబాద్‌లో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... రమేష్ బిధూరి వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికే అవమానకరంగా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలను అన్ని పార్టీల నేతలు ఖండించాలని అన్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిధూరిని బీజేపీ సస్పెండ్ చేయాలని కోరారు. ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే మహిళలు స్వేచ్ఛగా, నిర్బయంగా తిరగగలరా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
మహిళా వ్యతిరేకతను బీజేపీ అనువణువునా నింపుకుందని.. అందుకే రమేష్ బిధూరిని కమలం పార్టీ వెనకేసుకొస్తుందని అన్నారు. ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చి తన దుర్బుద్ధిని, పురుష దురంకారాన్ని బీజేపీ బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు. తన వికృత చేష్టలతో ఆడవాళ్లను కాషాయం పార్టీ అవమాన పరుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి మహిళలు బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. మనుధర్మ శాస్త్రాన్ని అవలంభించడమే బీజేపీ మూల సిద్ధాంతమని విమర్శించారు. మనుధర్మ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదని అన్నారు. మహిళలను గౌరవించడం బీజేపీకి అసలు తెలియదని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
Minister Ponnam Prabhakar: క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తాం
KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం
Bhatti Vikramarka: గురుకుల విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం
Read Latest Telangana News and Telugu News