Home » Andhra Pradesh » Ananthapuram
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్డీఓ) షఫీపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన ‘ఏం చేస్తే స్పందిస్తారో అనే కథనానికి అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శాప్ చైర్మన అనిమిని రవినాయుడు, కలెక్టర్ వినోద్కుమార్ స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మంగళవారం వనటౌన పోలీస్ స్టేషనలో సీఐ రాజేంద్రయాదవ్ను కలిసి రాతపూర్వకంగా పిర్యాదు అందజేశారు.
అనంతపురం నగరంలో పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదకర పను లు చేస్తున్న కార్మికులకు కనీస పనిముట్లు కరువ య్యాయి. దీంతో సరిగా మురుగు కాలువలు శుభ్రం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి వారిది. చెత్త ఎత్తివేయడా నికి పరికరాలు లేక ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారు. సమయానికి పరకలు అందజేయకపోతే వారే కొత్త పరకలు కొంటున్నారు.
భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబిం బాలు ఆలయాలు అని అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ అద్వైతానంద భారతి అన్నారు. శారదానగర్లోని శృంగేరి శంకరమఠం, మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, పాతూరులోని దత్తమందిరాలను మంగళవారం ఆయన సందర్శించారు.
రబీలో రైతులు సాగు చేసిన టమోట పంటకు వాతావరణ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఉద్యాన అధికారులు కృష్ణతేజ, మౌనిక సోమవారం ప్రకటనలో తెలిపారు.
దైవదర్శనం కోసం వెళ్లిన ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఆ కుటుంబంలోని చిన్నారిని నీటికొలను బలి తీసుకుం ది. మండలంలోని శనగలగూడూరు గ్రా మానికి చెందిన హరికుమార్ రెడ్డి, భార్య జ్యోతి, కుమారులు చక్రధర్ రెడ్డి (9), విఘ్నేశ్వరరెడ్డితో కలిసి సోమవారం ఉదయం నంద్యాల జిల్లా మహానందికి దైవదర్శనం కోసం వెళ్లారు.
మండలంలో మట్టి దందాకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ ఆస్తిని అమ్మేశానని బహిరంగంగా జిల్లా స్థాయి అధికారి చెబుతున్నా ఎలాంటి చర్యలు లేవు. నిధుల దుర్వినియోగం జరిగింది క్రిమినల్ కేసులు నమోదు చేయండన్న ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర య్యాయి. మరి ఏమి చేస్తే చర్యలు తీసుకుంటారో? మిగిలిన ప్రభుత్వ సామగ్రి, ఆస్తులను కూడా తెగనమ్మాలా? జిల్లా ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా జిల్లా క్రీడాశాఖలో ఓ అధికారి అవినీతి బాగోతం గురించే. ...
ఉమ్మడి అనంత కరువు కోరల నుంచి శాశ్వతంగా బయటపడాలంటే సాగునీరు కావాలి. ప్రతి ఎకరం తడిస్తేగానీ ఈ జిల్లా రైతాంగం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. వర్షపాతంలో అసమానతల కారణంగా ఖరీఫ్, రబీ.. రెండు సీజనలలోనూ పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు లేని సమయంలో భూగర్భ జలాలను వాడుకుందామంటే.. పాతాళం వరకూ బోర్లు తవ్వించాలి. అయినా తడి కనిపించదు. ప్రాజెక్టులు పూర్తయితే.. భారీ వర్షాలు, వరదల సమయంలో వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ఇదే సమస్యలన్నింటికీ పరిష్కారం. కానీ సాగునీటి...
అనంతపురం రైల్వే స్టేషనలో తత్కాల్ టికెట్ల జారీలో దళారుల దందాతో అసలైన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి తోడు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో అర్థం కాని పరిస్థితి. రిజర్వేషన కోసం నాలుగు కౌంటర్లు వినియోగించేలా భవనం అందుబాటులో ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సిద్ధం సభలో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెస్త సేవా సంఘం నాయకులు జిల్లా ఎస్పీ జగదీ్షను కోరారు.