Share News

RAINS : అకాల వర్షంతో వరిరైతు కష్టాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:07 AM

అకాల వర్షాలు అన్నదాతకు నష్టం తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో ఎడతెరపిలేకుండా కురుస్తు న్న వ ర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలతో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటి ల్లింది.

RAINS : అకాల వర్షంతో వరిరైతు కష్టాలు
A view of tarpaulins covering the parched paddy

కనగానపల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు అన్నదాతకు నష్టం తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో ఎడతెరపిలేకుండా కురుస్తు న్న వ ర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలతో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటి ల్లింది. పంట తడిసిపోయి కనీసం పశు గ్రాసం దక్కలేదు. అప్పుల పాలయ్యారు. అది మరవకనే వరి రైతులు అకాల వర్షాలకు నష్టపోతున్నారు. రెండు రోజులుగా ఎడతెరపి లే కుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్డుపై ఆరబెట్టిన వరిఽ దాన్యం తడసి పోతోంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా వరి రైతుల పరిస్థితి నెలకొంది. కోత కోయ కుంటే పొలంలోనే వరి నేలకొరుగుతోందని, కోతకోస్తే వర్షానికి నానిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. దీంతో వరినూర్పిడి యంత్రాలకు అధిక బాడుగు లు అవుతున్నాయని, పెట్టుబడులు కూడా చేతికందడం లేదని రైతులు వాపోతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 28 , 2024 | 12:07 AM