Home » I.N.D.I.A
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు.
బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో సమావేశం అవుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. మరికొన్ని విపక్ష పార్టీలు కూడా 'ఇండియా' కూటమిలో చేరబోతున్నాయంటూ అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించడంతో ఏయే పార్టీలు ముంబై మీట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే హాట్‌హాట్ చర్చ మొదలైంది.
ముంబైలో ఈనెల 31, సెప్టెంబర్ 1న జరగనున్న ప్రతిపక్షాల ''ఇండియా'' కూటమి సమావేశంలో లోగో ఎంపికతో పాటు సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్ ఎన్నిక కీలకం కాబోతున్నాయి. కూటమి కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ నియమితులయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తాను ఏదీ కావాలని అనుకోవడం లేదన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా (I.N.D.I.A) కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే, ప్రియాంక విజయం సాధిస్తారని శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పారు. ఈ స్థానం నుంచి మోదీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే వంటి 26 పార్టీలు ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని, ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత బీజేపీదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్‌సీపీ జారిపోబోతోందా?
నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.