Home » Mancherial
కులగణనపై అన్ని కుల సంఘాల నాయకులు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని కుల సంఘాలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని, జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వంపై ధర్మయుద్ధం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జ్యోతి పంక్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు నిర్వహించారు.
పత్తి రైతు పరేషాన్లో పడ్డాడు. సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న పత్తి పంట ఆఖరు దశలో తెగుళ్లు, చీడపీడలు విజృంభించడంతో దెబ్బతింటోంది. తెగులు ఉధృతికి రెండో దఫా పిందె కాయ కట్టక ముందే ఆకులు రాలిపోతున్నాయి. వర్షాలు లేక బలహీన పడిన పంటకు తెగులు తోడై నెల రోజుల ముందే చేలు ఎండిపోతున్నాయి. మరోవైపు లద్దెపురుగు విజృంభణ రైతులను బెంబేలెత్తిస్తోంది. రసాయన మందులు పిచికారి చేసినా లాభం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణం, చీడపీడల దాడి వెరసి దిగుబడి సగానికి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాయలంలో కాసిపేట మండలానికి చెందిన 17 దండారీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 15 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు.
దండేపల్లి మండలంలో గురువారం ఉరుములతో కూడిన కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మామిడిపల్లిలో వరి కోత దశలోకి రావడంతో గాలులతో కూడిన వర్షం కురవడంతో వరి పంట నేలవాలింది. వరి గింజలు నల్లబడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రైతుల వరిపంట కంకి దశలో ఉంది. నేలవాలడంతో నష్టం వాటిల్లింది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం, రాపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట మండల పరిధిలో రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శంకుస్ధాపన చేశారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) సమస్యలతో సతమతమవుతున్నాయి. అరకొర సౌకర్యాలతో అటు సిబ్బందికి, విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.