Home » New Delhi
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోనుంది. 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ ఈ వివరాలను వెల్లడించింది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రభావం కానీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం కానీ పెద్దగా ఉండకపోవచ్చని ఒపీనియన్ పోల్ జోస్యం చెప్పింది.
బీజేపీ నేతలను ''దోపిడీదారులు''గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు మంగళవారంనాడు అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంగళవారం సమావేశమయ్యారు.