Media Council India: త్వరలో మీడియా కౌన్సిల్ ఏర్పాటు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:06 AM
దేశంలో పెరుగుతున్న డిజిటల్ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా యాప్‌ల నియంత్రణ కోసం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ కొత్త కౌన్సిల్ ముద్రణ, డిజిటల్, ప్రసార మాధ్యమాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే ప్రతిపాదనను సమర్థించింది

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో డిజిటల్ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా యాప్‌లు భారీ సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. వీటి నియంత్రణ ప్రభుత్వాలకు సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మీడియా కౌన్సిల్ అనివార్యమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి ఇటీవలే నివేదించింది. ముద్రణ, ప్రసార, డిజిటల్ మీడియాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కొత్తగా మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం డిజిటల్ వేదికలు ఐటీ చట్టం, 2021 కింద ఉన్నాయి. ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ నియంత్రిస్తున్నది. టీవీ చానళ్లు కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ మీడియా కౌన్సిల్ ఏర్పాటు ద్వారా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News